ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ వరకు కలెక్షన్లు బాగా రాబట్టుకుంటున్నాయి. కానీ సోమవారం నుండి వీక్ డేస్ మొదలయ్యాక కలెక్షన్లలో భారీగా డ్రాప్ వస్తూ ఉండటంతో హిట్ అవుతాయనుకున్న సినిమాలు కూడా బిలో యావరేజ్, ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంటున్నాయి. ఆగస్టు నెల 30వ తేదీన విడుదలైన ప్రభాస్ సాహో సినిమాకు రిలీజైన రోజే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. 
 
కానీ సినిమా విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో మొదటి మూడు రోజులకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. సోమవారం రోజు వినాయకచవితి పండుగ కావటంతో ఆరోజు కూడా భారీగా కలెక్షన్లు వచ్చాయి. కానీ మంగళవారం రోజు డ్రాప్ అయిన సాహో కలెక్షన్లు ఆ తరువాత పుంజుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు 40 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. 
 
సెప్టెంబర్ 13వ తేదీన విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు రిలీజ్ రోజు అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 50 శాతం రికవరీ చేసింది. కానీ సోమవారం డ్రాప్ అయిన కలెక్షన్లు తరువాత రోజుల్లో మరింతగా డ్రాప్ అయ్యాయి. సినిమా విడుదలైన తరువాత సరైన ప్రమోషన్స్ చేయకపోవటం వలన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు తగ్గాయని సమాచారం. ఈ వారం విడుదలైన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వచ్చింది. 
 
రెండు రోజుల్లోనే 10కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లొచ్చాయి. రేపటినుండి వీక్ డేస్ మొదలవుతూ ఉండటంతో గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచి సినిమా కలెక్షన్లలో డ్రాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరుణ్ తేజ్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించింది. తమిళ నటుడు అథర్వ, మృణాళిని ముఖ్య పాత్రల్లో నటించారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: