వాల్మీకి సినిమా హడావుడి బాగా మొదలయింది. విడుదలైన రోజు అన్ని చోట్లా బాగానే కలెక్షన్లు నమోదు చేసింది. ముందు రోజు రాత్రి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, పేరు మార్చడం వంటి అంశాలు సినిమాకు బాగానే కలిసి వచ్చాయి. దాదాపు పాజిటివ్ సమీక్షలు కూడా వచ్చాయి. అయితే శనివారం కలెక్షన్లు మాత్రం అనుకున్నట్లు లేవు. కలెక్షన్లు స్టడీగా వున్నట్లే వుందనిపిస్తోంది. కానీ శ్రీకాకుళం లాంటి మాస్ సెంటర్లలో అలాగే కింద సెంటర్లలో థియోటర్స్ ఫుల్ కాకపోవడం, కాకినాడ, మరి కొన్ని చోట్ల ఫస్ట్ షో లు ఫుల్ కాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సండే, మండే ట్రెండ్ లు చూస్తే సినిమా ఏ మేరకు చేస్తుంది అన్నది క్లారిటీ వస్తుందన్నది ట్రేడ్ వర్గాల మాటగా వినిపిస్తుంది.

ఫస్ట్ డే హడావుడి చూసి, ఈ సినిమా మరో ఇస్మార్ట్ శంకర్ రేంజ్ కలెక్ట్ చేస్తుందని అనుకన్నారు. కానీ శనివారం ట్రెండ్ చూస్తే అలా లేదు. సండే, మండే చూస్తే కానీ విషయంపై క్లారిటీ రాదని చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మండే నుంచి కలెక్షన్లు తగ్గిపోకుండా నిలబెట్టాలని 14రీల్స్ ప్లస్ యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే సోమవారం ఓ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం నుంచి థియేటర్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్.

వచ్చేవారం థియేటర్లలో సినిమా లేదు కనుక, సైరా వచ్చేవరకు షేర్ ను వీలయినంత పెంచాలని మూడు ఏరియాల్లో వరుణ్ తేజ్ థియేటర్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాకు 14రీల్స్ ప్లస్ సంస్థకు పెద్దగా మిగిలింది లేదని మరో న్యూస్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాను నిలబెట్టకపోతే, బయ్యర్లు జీఎస్టీ కట్టడం సమస్య అవుతుంది. అప్పుడు మళ్లీ 14రీల్స్ మీద అదనపు భారం పడుతుంది. అందుకే పబ్లిసిటీలో స్పీడ్ పెంచాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫ్రెష్ అప్‌డేట్. ఇవన్నీ ఇలా వుంటే ఓవర్ సీస్ లో మాత్రం వాల్మీకి బయ్యర్ గట్టెక్కడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో క్లారిటి రావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: