2020 సంక్రాంతికి ఈ సారీ మంచి పోటీ వుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు మెగాస్టార్, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున పోటీ పడుతుంటారు. కానీ ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు. యంగ్ మాస్ ఎంటర్ టైనర్ అనిల్ రావిపూడి.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీళ్ల  కాంబినేషన్ లో వచ్చే 'సరిలేరు నీకెవ్వరూ', 'అల వైకుంఠపురములో' సినిమాలు 2020 సంక్రాంతికి రాబోతున్నాయి. అంతేకాదు ఈ సంక్రాంతికే సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్బార్, నందమూరి కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమాలు కూడా వున్నాయి. అయినా కూడా మహేష్, బన్నీల సినిమా మీదనే అందరి దృష్టి ఉంది.

సంక్రాంతికి అని ఫిక్సైనా కూడా ఇప్పటివరకు బన్నీ సినిమా డేట్ కానీ, మహేష్ సినిమా రిలీజ్ డేట్ కానీ అనౌన్స్ చేయలేదు. ఒకరు డేట్ అనౌన్స్ చేస్తే గాని ఇంకొకరు తమ డేట్ అనౌన్స్ చేయాలని ఇన్ని రోజులు ఆగినట్టు తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో 'అలవైకుంఠపురములో' సినిమా నిర్మాతలు ఓ క్లారిటీకి వచ్చారు. ఎప్పుడు మహేష్ బాబు సినిమా డేట్ వచ్చినా, ఆ తర్వాత బన్నీ సినిమా విడుదల చేయాలని అల నిర్మాతలు ఫిక్స్ అయిపోయినట్టు వ్యవహారించారు. అందుకు తగ్గట్టుగానే జనవరి 12 డేట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. 

అయితే జనవరి 12 ఆదివారం అవడంతో అందరు చిన్న షాక్ లో ఉన్నారు. సాధారణంగా శుక్రవారానికి ఒకటి రెండు ముందు రోజులు కాదంటే నాలుగు రోజులు ముందు సినిమా విడుదల చేయడం అలవాటే కానీ శుక్రవారం వెళ్లిన తరువాత ఆదివారం సినిమా విడుదల అన్నది అసాధ్యం. అందులోను సంక్రాంతి సీజన్ లో ఇలా ఇంతకముందెన్నడు జరిగింది లేదు. మరి ఏ స్ట్రాటజీతో ఆదివారం సినిమాకు ఈ డేట్ ను ఎంచుకున్నారో చిత్ర బృందానికే తెలియాలని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. శుక్రవారం ప్రీమియర్లు, శని, ఆదివారాలు వీకెండ్ కలెక్షన్లు ఓవర్ సీస్ లో వుంటాయి. వాటిని వదులుకుంటున్నారా అన్న విషయంలో అయోమయం నెలకొంది. నిజంగా ఒకవేళ ఆదివారం గనక ' అల ' రిలీజైతే ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: