తెలుగు టెలివిజన్ రగంలో జబర్ధస్త్ కామెడీ షో మొదలై..ఆరు సంవత్సరాలు దాటింది.  ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తమ స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  అయితే జబర్ధస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుదూర ప్రయాణం చేస్తూ వచ్చారు సుధీర్ అండ్ టీమ్.  టాలీవుడ్ లోకి జబర్ధస్త్ కమెడియన్లు ఎంట్రీ ఇస్తున్నారు.  వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ అయితే ఏకంగా హీరో అవతారం ఎత్తాడు.  ఇలా జబర్ధస్త్ కమెడిన్లు సినిమాల్లో తమ పర్ఫామెన్స్ తో సత్తా చాటుతున్నారు.  జబర్దస్త్ షో కు మూల స్దంబాల్లో ఒకడు గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీనుకు మంచి డిమాండ్ ఉంది. అతను వేషే గెటప్ లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా బిల్డప్ బాబాయ్ స్కిట్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయ్యింది. దాంతో అతని స్కిట్ లకు విపరీతమైన ప్రేక్షకాదరణ పెరిగింది. ఎన్నారై అసోసియేషన్స్ అమెరికా, లండన్ వంటి దేశాల్లో గెటప్ శీనుతో షోలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే షకలక శంకర్, రంగస్థలం మహేష్, చమ్మక్ చంద్ర, ధన్‌రాజ్, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లంతా హీరోలయ్యారు. వాళ్లు క్లిక్ అవుతున్నారా లేదా అనేది పక్కనబెడితే హీరోలైతే అవుతున్నారు. ఇప్పుడు అదే వరసలో గెటప్ శ్రీను కూడా ఇలాగే హీరో అయ్యాడు. డబ్ స్మాష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గెటప్ శ్రీను. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. తాజాగా జబర్దస్త్ టీం సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను నటించిన 3 మంకీస్ చిత్ర లోగో లాంచ్ కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ గెటప్ శ్రీనుని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంప్రసాద్ మంచి రచయిత. పంచ్ డైలాగ్స్ రాయడంతో అతడికి తిరుగులేని ప్రతిభ ఉంది.  గెటప్ శ్రీను అద్భుతమైన ప్రతిభ ఉన్న కమెడియన్. అతడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెర్ఫామ్ చేయగలడు.

 శ్రీను నాకు కొడుకు కాదు.. కానీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అతడిలో ఆ ప్రతిభ గమనించారు..అతని అవసరం జబర్ధస్త్ కన్నా ఇండస్త్రీకి ఎంతో అవసరం ఉంది..గెటప్ శీను తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడుగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. నుకు ఒక్క మంచి అవకాశం దొరికితే అద్భుతంగా నటిస్తాడు. అతడు జబర్డస్త్ లో వివిధ గెటప్ లలో ఎలా, వివిధ బాడీ లాంగ్వేజ్ లలో ఎలా నటించాడో నాకు తెలుసు. గెటప్ శ్రీనుని ఉపయోగించుకోక పోతే అది ఇండస్ట్రీకే నష్టం అని నాగబాబు అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: