తెలుగు సినిమాల్లో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఓసారి పని చేసిన కాంబినేషన్ హిట్ అయితే దానిని కంటిన్యూ చేయాలనే చూస్తారు. మరికొన్ని సందర్భాల్లో దర్శకుడికి ఆయా హీరోలతో, హీరోయిన్లతో మంచి రాపో ఉండడంతో వారితోనే మరో సినిమా కంటిన్యూ చేయాలని చూస్తారు. ప్రస్తుతం సంపత్ నంది అదే ఫాలో అవుతున్నట్టున్నాడు. గోపీచంద్ తో త్వరలో ఓ సినిమా చేయనున్నాడు సంపత్ నంది. ఇందులో హీరోయిన్ గా తమన్నాను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

 


తమన్నాను హీరోయిన్ గా తీసుకుని ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు డైరక్టర్ సంపత్ నంది. 2011లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన రచ్చ సినిమాలో తమన్నానే తీసుకున్నాడు. ఆ తర్వాత 2015లో సంపత్ – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాలో రెండోసారీ తమన్నానే తీసుకున్నాడు. ఆ రెండు సినిమాల్లో తమన్నా గ్లామర్ అదరహో అనే రేంజ్ లో ఉంది. తమన్నా గ్లామర్ ఆ సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు. దీంతో తనకు లక్కీ చార్మ్ గా ఫీలయ్యాడో ఏమో.. సంపత్ నంది తాను గోపీచంద్ తో తీయబోయే సినిమాకు కూడా తమన్నాను సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తమన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కరం దాటుతున్నా ఇంకా తరగని అందంతో అభిమానులను అలరిస్తోంది. దీంతో ఈ సినిమాలో గ్లామర్ మ్యాజిక్ కోసం తమన్నానే బెస్ట్ ఆప్షన్ అని సంపత్ నంది భావిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

 


సంపత్ నంది గత చిత్రం గోపీచంద్ తోనే చేశాడు. గౌతమ్ నందా టైటిల్ తో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా గోపీచంద్ మళ్లీ సంపత్ కు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మంచి కాంబినేషన్ సెట్ అయినట్టే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: