తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటికే 60 రోజులకు పైగా సాగింది. ఇటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు...షాక్ లు చూస్తున్న వీక్షకులకు ఎంతగానో టెన్షన్ పుట్టిస్తున్నాయి. తాజాగా శనివారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ లో...ఇంటి సభ్యుల ముందు రాహుల్ ని ఎలిమినేట్ అయ్యారని ప్రకటించి ఇంటి సభ్యులను నమ్మించిన హోస్ట్ నాగార్జున...తర్వాత రాహుల్ కి ఇది ఫేక్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. కాని ఈ విషయం ఇంకా ఇంటిలో ఉన్న సభ్యులకు ఎవరికీ తెలియదు.


కాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో.. నాగార్జున.. హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి కొన్ని మెడ్లీ పాటలకు డాన్స్ చేయించారు. అనంతరం బిగ్ బాస్ షోకి గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ కాసేపు హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. ఆ తరువాత హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని వరుణ్ తేజ్ తో అనౌన్స్ చేయించారు. అతడు హిమజ పేరు చెప్పడంతో ఆమె హ్యాపీగానే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది. ఆ తరువాత హౌస్ లో తన జర్నీని వీడియోగా వేసి చూపించగా.. హిమజ చాలా ఎమోషనల్ అయి ఏడ్చేసింది. హౌస్ లో చాలా విషయాలను నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.


ఇక హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఒక్కొక్కరికీ ఒక్కో సలహా ఇచ్చింది. ఇలా ఆదివారం జరిగిన ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ ఇంటి నుండి బయటకు వచ్చిన క్రమంలో చాలా మటుకు హౌస్ లో ఉన్న సభ్యులు ఎక్కువగా భావోద్వేగానికి పెద్దగా గురికాలేదు. దానికి కారణం హిమజా ఫస్ట్ నుండి సెల్ఫ్ గేమ్ ఆడుతూ ఇంటి సభ్యులతో కలుస్తూ కలవ నట్టు ఉండటమేనని చాలామంది హిమజా ఎలిమినేషన్ అవటం పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: