ఆది వారం డాటర్స్ డే సందర్భంగా  అల్లు అర్జున్ ,మహేష్ బాబు  తమ కూతుర్ల పైన ఉన్న అభిమానాన్ని సోషల్ మీడియా వేదిక గా వ్యక్తపరిచారు. అల్లు అర్జున్ డాటర్స్  డే సందర్బంగా కూతురు అర్హ తో కలిసి చేసిన వీడియో ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశరు. ఈ వీడియో పోస్ట్  చేసిన కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది.

ఈ వీడియో లో అల్లు అర్జున్ . అల్లు అర్హ అల వైకుంఠపురం  టీజర్ లోని డైలాగ్ చెబుతూ కనిపించారు. అల్లు అర్జున్ ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అని అర్జున్ అడగ్గా చిన్నరి అర్హ ఇవ్వలా వచ్చింది అని సిగ్గు పడుతూ అర్జున్ ని  హగ్ చేసుకుంది. బన్నీ తన కూతురు  కు సంబంధించిన ఫోటో లు ఇన్స్టాగ్రామ్  ద్వారా పంచుకుంటారు.ఈ వీడియో 8 గంటల్లో దాదాపు 8 లక్షల మంది వీక్షించారు.  సుమారు గా 5 లక్షల లైక్స్ వచ్చాయి.ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం లో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితార కు డాటర్స్ డే విషష్ చెబుతూ ఒక వీడియో ను ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు. నా చిన్నారి సితార పాపకు డాటర్స్ డే శుభాకాంక్షలు .నువ్వు చాలా ప్రియమైన  అల్లరి పిల్ల వు .నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను  అని ట్వీట్ చేశారు. మహేష్ సితార కలిసి ఉన్న ఫోటో లను వీడియో గా చేసి ట్వీట్ ఛేశారు. ఈ వీడియో ను 1.43 లక్షల మంది వీక్షించారు 50 వేల లైక్స్ వచ్చాయి.  ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావుపూడి  దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు " సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 2020 సంక్రాంతికి  రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: