మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెంచేసింది. ఇకపోతే ఈ సినిమా కోసం నిర్మాత రామ్ చరణ్ ఏకంగా రూ.250 కోట్ల పైచిలుకు ఖర్చు చేసినట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, పలువురు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన దిగ్గజ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా, అనుష్క శెట్టి, నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వివి వినాయక్, రాజమౌళి తో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ, తాను చరణ్ తో మగధీర సినిమా తీయాలని భావించినప్పుడు మొదటగా మెగాస్టార్ గారికే కథ చెప్పానని, అయితే ఆయన ఆ కథను బాగా ఫీల్ అయి, అందులో తానే హీరో అని భావిస్తూ చిరంజీవి గారు తనకు కథ లోని సన్నివేశాల గురించి ఎంతో ఆసక్తిగా మాట్లాడుతుండేవారని చమత్కరించారు. అయితే అప్పుడు తనకు ఒక విషయం అర్ధం అయిందని, అదేమిటంటే చిరంజీవి గారికి కత్తి యుద్ధాలతో ఒక భారీ ఫిలిం చేయాలనే భావన ఆయన మనసులో ఉన్నట్లు తెలుసుకున్నానని అన్నారు. అయితే దానిని ఆయన కుమారుడు రామ్ చరణ్ గ్రహించి, ఈ విధంగా సైరా రూపంలో బయటకు తీసుకురావడం నిజంగా తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 

ఇకపోతే సైరాకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేస్తున్న సూపర్ వైజర్ కమల్ కణ్ణన్ గారు కొద్దిరోజుల క్రితం తనకు ఒక మెసేజ్ చేసారని, అందులో సర్ రాజమౌళి గారు, మీ బాహుబలిలో 2300 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటె, మెగాస్టార్ గారి సైరా సినిమాలో 3800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని చెప్పారని అన్నారు. నిజానికి విఎఫ్ఎక్స్ షాట్స్ చేయడం కష్టం కాదని, అయితే అన్ని వేల షాట్స్ మధ్యలో ఎమోషన్స్ ని మర్చిపోకుండా ఎంతో అద్భుతంగా సినిమా తీశారంటే, ఖచ్చితంగా ఆ గొప్పతనం దర్శకుడు సురేందర్ రెడ్డి గారిదే అని ఆయన్ని కొనియాడారు రాజమౌళి. అయితే ఈ విషయంలో మాత్రం  సైరా ఒకవిధంగా బాహుబలిని బీట్ చేసినట్లే కాదా అని కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో అభిప్రాయాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రోజురోజుకు విపరీతంగా అంచనాలు పెచుకుంటూ పోతున్న మెగాస్టార్ సైరా, రిలీజ్ తరువాత ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: