మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా మరొక పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడంతో పాటు సినిమాపై తారా స్థాయిలో హైప్ ని తీసుకురావడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి నిర్మిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించడం జరిగింది. అమితాబ్ బచ్చన్, గోసాయి వెంకన్న అనే ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అటు బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. మంచి పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో అట్టహాసంగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ ప్రత్యేక అతిథులుగా జరిగిన ఈ వేడుకలో మరికొంతమంది సినిమా ప్రముఖులు సందడి చేసారు. ఇకపోతే ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, మనం నేడు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంతో హాయిగా జీవిస్తున్నాం అంటే, దానికి కారణం ఎందరో స్వతంత్ర సమరయోధులు మన కోసం వారి కుటుంబాలను, ఆఖరికి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టడడమే అని అన్నారు. 1850 సమయంలో రాయలసీమలోని రేనాడు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మొదటిసారిగా అప్పటి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి స్వతంత్రం కోసం పోరాడడం జరిగిందని, 

కానీ అంతటి గొప్ప తెలుగు వీరుడి కథ మరుగున పడిపోయిందని, అయితే రేపు ఈ సినిమా రిలీజ్ తరువాత నరసింహారెడ్డి గారి గొప్పతనం గురించి దేశ ప్రజలందరూ ఎంతో గర్వంగా మాట్లాడుకుంటారని అన్నారు. ఇక ఈ సినిమాను రాబోయే అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున రిలీజ్ చేయడానికి ఒక కారణం ఉందని, ఆ రోజుకి మన జాతిపిత గాంధీ గారు జన్మించి  సరిగ్గా 150 ఏళ్ళు పూర్తి అవుతుందని, ఆ సందర్భంగా తమ సినిమా విడుదలవ్వడం తమ యూనిట్ అందరికీ ఎంతో గొప్ప గర్వకారణం అని మెగాస్టార్ చెప్పారు. తామందరం కలిసి రెండున్నరేళ్ళ పాటు సినిమా కోసం ఎంతో శ్రమించామని, అయితే రేపు సినిమా రిలీజ్ తరువాత, మన తెలుగు ప్రజలు తప్పకుండా మాకు మంచి విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉందని అన్నారు మెగాస్టార్.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: