బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి.ఈ సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో కూడా జోరు పెంచేస్తున్నారు టీం.ఇందులో భాగంగానే చిత్ర ప్రీ రిలీజ్ ఇవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయాలా? అనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్‌ నన్ను దర్శకత్వం చేయమన్నారు.



దర్శకుడు అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ జాబ్.యాక్టింగ్ చేస్తూ దర్శకత్వానికి న్యాయం చేయలేం.అందుకే ఎలా,ఎవరైతే బాగా సూట్ అవ్వుతారు అని ఆలోచిస్తున్న సమయంలో చరణ్‌ సురేందర్‌రెడ్డి పేరు చెప్పాడు.‘ధృవ’ సినిమా నాకు చాలా బాగా నచ్చిందిరా.. అతను బాగా కష్టపడతాడు,ఈ సినిమాలో ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, కొత్తగా ఆలోచన చేయాలి అని నేను అన్న వెంటనే,చరణ్ సమర్థత,సామర్థ్యం ఉన్న దర్శకుడు డాడీ చేస్తాడు అన్నాడు.నేను ఓకే చెప్పాను.ఇక ఆ మాట అతనికి చెప్పగానే సురేందర్ రెడ్డి ఎగిరి గంతేస్తాడు అనుకున్నాను.కాని క్వైట్‌గా,కంపోజ్‌డ్‌గా ఉండి..నాకు కొంచెం టైమ్ కావాలి సార్ అన్నాడు.అది మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది.ఇదేంటిరా బాబూ అనిపించింది.వారం రోజుల తర్వాత సురేందర్ రెడ్డి వచ్చి ప్రిపేర్ అయ్యాను సార్ చేస్తాను అన్నాడు.



ముందు ఎందుకు వద్దాన్నావ్ అని అడిగితే.. ఏం లేదు సార్ ఒకవైపు చిరంజీవి,మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ..నేను ఈ సినిమాకు న్యాయం చేయగలనా అని నన్ను నేను అనాలసిస్ చేసుకోవడానికి పట్టిన సమయం సార్ ఇది అన్నాడు.మీరు అడిగిన సమయంలో నేను డౌట్లో ఉన్నాను కాని ఇప్పుడు ఫుల్ క్లారీటిగా ఉన్నాను అని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.అదే కథను చక్కటి కథనంతో,కథాగమనంతో,ఎమోషన్స్‌తో యథార్థ గాధను ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ చేసి చాలా చక్కగా మలిచిన సురేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.హ్యాట్సాఫ్.సురేందర్ అంటూ చిరు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: