ఈ వారం ఎలిమినేషన్ లో టఫ్ కాంపిటీషన్ జరిగింది. నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజలలో హిమజ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజి మీదకి వచ్చిన హిమజకి బిగ్ బాస్ లో తన జర్నీని చూపించారు. సాధారణంగా ప్రతీ ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ లో తన ప్రయాణాన్ని చూసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. హౌస్ ని విడిచి వెళ్తున్నాం అనే బాధ వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.


హిమజ కూడా భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టుకుంది. కానీ అది బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయినందుకు కాదు. హౌస్ లోనుండి వెళ్ళిపోవడానికి గల కారణాన్ని తలచుకుని ఆమె ఎక్కువగా బాధపడింది. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ఇంత దూరం వచ్చానని చాలా సార్లు ప్రస్తావించిన హిమజ మరో మారు వాటిని గుర్తు చేసుకుంది. తన జీవితంలో తాను నేర్చుకున్న పాఠాల వల్ల ఆమె మారిపోయిందని, కానీ ఆ పాఠాలు బిగ్ బాస్ హౌస్ లో పనిచేయలేకపోయానని చెప్పింది.


ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఎక్కువ చనువు ఇవ్వకూడదు, చనువు తీసుకోకూడదు అని నమ్మిన సూత్రం బిగ్ బాస్ హౌస్ లో ఆమెకు ప్రతికూలంగా మారింది. ఆమె ఎవరితో కలవదని ఇంటి సభ్యులందరూ చాలా సార్లు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాన్ని క్లియర్ గా చెప్తూ, మరీ అంత వివాదాస్పదం కాకుండా తన మనసులో ఉన్న భావాన్ని చెప్తూ తెలివిగా వ్యవహరించింది.


ఎలిమినేషన్ తర్వాత నాగార్జున అడిగే రెగ్యలర్ క్వశ్చన్ "మళ్ళీ ఛాన్స్ ఉంటే హౌస్ లోకి వెళ్తావా "అని. ఈ ప్రశ్న అడగగానే అందరూ మొహమాటానికైనా సరే ఖచ్చితంగా వెళ్తాను అంటారు. కానీ హిమజ అందుకు విభిన్నంగా నేను వెళ్ళను అంటుంది. అంతే కాదు అది కేవలం వన్ టైం డ్రీమ్ మాత్రమే. ఆ మాత్రం చాలు నాకు అంటుంది. తన మనసులో ఉన్నది ఉన్నట్టు  చెప్పడంతో ఆమెపై ప్రేక్షకులకి మరింత గౌరవం పెరిగింది.




మరింత సమాచారం తెలుసుకోండి: