మెగాస్టార్  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మాత వ్యవహరించిన ఈ సినిమా  ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కన్నుల పండుగగా జరిగింది.  ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ . ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, కొరటాల శివ అతిథులుగా హాజరయ్యారు.


41 సంవత్సరాల క్రితం  తన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక పక్క టెన్షన్ మరొపక్క ఎక్సైట్‌మెంట్ ఫీలయ్యానని మళ్లీ ఇప్పుడు సైరా సినిమాకు అలానే ఫీలవుతున్నాను అని ఆయన చెప్పారు. తనకు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాత్ర చేయలని ఉండేదాని కానీ ఎవరు తన దగ్గరికి ఆ స్ర్కిప్ట్ తీసుకురాలేదని అన్నారు.12 సంవత్సరాల క్రితం పరుచూరి బ్రదర్స్ తన దగ్గరికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథను తీసుక వచ్చారని, ఆ పాత్రలో చాలా డైమెన్షన్స్ ఉండడంతో ఇది మంచి సినిమా అవుతుందని వారు అన్నారు. సినిమా గా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది పక్కన పెడితే ఒక  కనుమరుగు అవుతున్న  స్వాతంత్ర్య సమరయోధుడి కథను మన భావితరాలకు చెప్పిన వాళ్ళము అవుతాం అని అన్నారు.


బడ్జెట్ సమస్య వల్ల ఆ ఆలోచన అక్కడికే ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా వస్తుందంటే కారణం దర్శకుడు రాజమౌళి . ఆయన బాహుబలి తీసుండకపోతే సైరా సినిమా వచ్చేది కాదు.   దర్శకుడి గురించి వెతుకుతున్నప్పుడు చరణ్ సురేందర్ రెడ్డి పేరు చెప్పాడు. సురేందర్ రెడ్డి ఒక నెల రోజులు ఆ ప్రాంతానికి వెళ్లి నరసింహారెడ్డి గురించి రీసెర్చ్ చేసి అక్కడి నుండి మూడు వారాల  గోవా వెళ్లి ఒక మంచి ఎమోషన్స్ ఉన్న కథ రెడీ చేసి మా దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ కథ అందరికి చాలా బాగా నచ్చడంతో సైరా షూటింగ్ మొదలైంది అని అన్నారు.

ఈ కథలో చాలా ఫైట్ంగ్ సీక్వెన్స్ లు ఉన్నాయి నాతో అవుతుందా లేదా అని కొంచెం సతమతం  అయ్యాను. కానీ అప్పుడు అందరు టెక్నాలజీ తో మానేజ్ చేయవచ్చు అన్నారు. చివరికి నాతోనే ఆ  ఫైట్ంగ్ సీక్వెన్స్ లు చేయించారు.  ఒక్క సారి కత్తి పట్టి గుర్రం ఎక్కనంటే నన్ను నేనే మరిచిపోతాను  అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: