తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సైరా మేనియా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సైరా. బ్రిటీష్ వాళ్ల పాలనను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే సైరా.   ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో  ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరుగింది. ఎల్బీస్టేడియం మెగా అభిమానులతో జనసంద్రంలా మారింది.  ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో  పలువురు నటీనటులు,టెక్నీషియన్స్ తమ అనుభవాలు ఆడియన్స్ తో పంచుకున్నారు.  ఈ సందర్భంగా థర్టీఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వి రాజ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను ఎన్నో పాత్రలు వేశాను..విలన్, కామెడీ, క్యారెక్టర్ అయితే ‘సైరా’లో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 

ఒకదశలో చెప్పాలంటే ఇంట్రవెల్ కి ముందు నా పాత్ర ప్రాధాన్యత ఎంతో కనిపించేలా మెగాస్టార్ చిరంజీవిగారు.. ఈ సందర్బంగా నేను ఒక్కటే చెబుతాను..ఆయన రుణం జన్మ జన్మలకూ తీర్చుకోలేనిది..తాను చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను అని పృథ్వి తెలిపాడు. నరసింహ స్వామి మళ్ళీ పుట్టాడు దొరా అనే ఎమోషనల్ డైలాగ్ తనకు ఉందని పృథ్వి తెలిపాడు.  నా పాత్రని బట్టే చెప్పొచ్చు ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతోందో అని పృథ్వి అన్నాడు.

చలన చిత్ర రంగంలో ‘సైరా’ మరో చరిత్ర సృష్టిస్తుంది..అంత గొప్ప వీరుడు గాధను తెరకెక్కించడంలో చిత్ర యూనిట్ ఎంతో కష్టపడ్డారు..ఆ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మెగాస్టార్ కత్తితో నరికే సన్నివేశం ఉంది. అలా ఆయన రికార్డులని తెగనరకడానికి వస్తున్నారు. ఈ మూవీలో మేము ఎమోషనల్ గా సాగే ఫైట్స్ చేశాం అని రామ్ లక్ష్మణ్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: