‘సైరా’ ఈవెంట్ లో మాట్లాడడానికి వేదిక పైకి వచ్చిన అల్లు అరవింద్ కు మెగా అభిమానుల నుండి ఊహించని ఎదురైంది. చేతిలో మైక్ పెట్టుకుని అరవింద్ చిరంజీవి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మెగా అభిమానులు అతడి ఉపన్యాసానికి విపరీతంగా అడ్డు తగిలారు.

దీనితో షాక్ అయిన అరవింద్ తాను చిరంజీవి గురించి ఆయనకు కూడ తెలియని ఒక విషయం చెపుతాను అంటూ అనేకసార్లు చెప్పినా మెగా అభిమానులు పట్టించుకోలేదు. అయితే ఇది అంతా ఎదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదనీ అల్లు అర్జున్ పై మెగా అభిమానులకు ఉన్న వ్యతిరేకతతో ఈ సంఘటన జరిగింది అని అంటున్నారు.

ఈ ఈవెంట్ కు మెగా హీరోలు అందరు వచ్చారు. రాజమండ్రిలో తన మూవీ షూటింగ్ చేసుకుంటున్న సాయి తేజ్ కూడ తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ప్రత్యేకంగా చిరంజీవి కోసం వచ్చాడు. అయితే అల్లు అర్జున్ హైదరాబాద్ లోనే ఉండి ఈ ఈవెంట్ కు రాకపోవడం మెగా అభిమానులకు కోపాన్ని తెప్పించినట్లు టాక్. వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్ మూవీ కోసం కొంపల్లిలో షూటింగ్ లో ఉన్నప్పటికీ ఎల్ బి స్టేడియం ఈవెంట్ కు రావడానికి గంట కూడ పట్టని పరిస్థితులలో బన్నీ షూటింగ్ వంకతో ‘సైరా’ ఈవెంట్ ను తప్పించుకోవడం మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు టాక్. 

దీనికితోడు ‘సైరా’ ట్రైలర్ విడుదలై నాలుగు రోజులు అయినప్పటికీ బన్నీ ఆ ట్రైలర్ పై ఇప్పటికీ స్పందించక పోవడం మెగా అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మెగా అభిమానుల కోపాన్ని తగ్గించడానికి బన్నీ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా మళ్ళీ ఎదో ఒక చిన్న పొరపాటుతో బన్నీ తీరుతో అతడికి సమస్యలు రావడమే కాకుండా అతడి తండ్రి అల్లు అరవింద్ కు కూడ సమస్యలు తెచ్చి పెడుతున్నాయి అని అంటున్నారు..
 



మరింత సమాచారం తెలుసుకోండి: