తెలుగులో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అయినా సక్సెస్ మాత్రం కొంత మంది హీరోయిన్లకే దక్కింది.  దాంతో వారు తెరపై కనిపించ కుండా పోయారు.  కానీ హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయినా... గ్లామర్ గాళ్‌గా సౌత్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది రాయ్‌ లక్ష్మి.  ఆ మద్య  ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్, కామెడీ జోనర్ లో వచ్చిన ఈ మూవీ కాస్త పరవాలేదు అనిపించింది.  కానీ ఈ అమ్మడికి మాత్రం ఏదీ కలిసి రాలేదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’లో రత్తాలు రత్తాలు అనే సాంగ్ తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. గతంలో బొద్దుగా కనిపించే రాయ్ లక్ష్మి ఇటీవల కాస్త సన్నబడి కనిపిస్తోంది. బరువు తగ్గడం  కోసం బాగానే కష్టపడినట్లు ఆమె ఈ మద్య పోస్ట్ చేస్తున్న పిక్స్ చూస్తుంటే అర్థం అవుతుంది.  బీచ్ లో రాయ్ లక్ష్మి షూట్ చేస్తున్న బికినీ ఫోటోలు యూత్ ని కట్టిపడేస్తున్నాయి. ఇటీవల బికినీ లుక్ లో కొత్త తరహా అందాల్ని ప్రజెంట్ చేసింది. వయ్యారి నడుముతో స్లిమ్ అయినట్లు చెప్పకనే చెబుతోంది. సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా..గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా చూస్తుంది. 

ఆ మద్య బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా సక్సెస్ మాత్రం కాలేకపోయింది. దాదాపు నలభైకి పైనా సినిమాల్లో నటించిన రాయ్ లక్ష్మి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది.  మరోపక్క ఐటమ్ సాంగ్స్ లో కూడా ఇరగదీస్తుంది.  తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అంటూ భాషాబేధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్న లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో కూడా జూలీ 2 (2017) సినిమా చేసి గ్లామర్ డోస్ తో హీటెక్కించింది. ప్రస్తుతం లక్ష్మి ఒక కన్నడ సినిమాతో పాటు తమిళంలో కూడా ఓ  సినిమా చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: