మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం గా తెరకెక్కుతోన్న మూవీ సైరా నరసింహారెడ్డి. 250 కోట్ల భారీ బడ్జెట్ తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది  ఈ చిత్రం. కాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో  నరసింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా నరసింహారెడ్డి భార్యగా నయనతార నటిస్తోంది. వీళ్లతో పాటు భారీ తారాగణం కూడా నటిస్తోంది. నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. 

 

 

 కాగా ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. అయితే చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. కాగా  ఈ సినిమాని తెలుగుతో  పాటు హిందీలో కూడా విడుదల చేయబోతుంది చిత్రం బృందం . అయితే టాలీవుడ్ లో అయితే చిరంజీవికి ఉన్న క్రేజ్ తో  ప్రమోషన్స్ లేకుండానే చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందన్న  విషయం అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో  మాత్రం సైరా కు ప్రచారం తప్పనిసరి. అందువల్లే రామ్ చరణ్ తనకు పరిచయమున్న బాలీవుడ్ హీరోలతో సంప్రదించి  ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు . 

 

 

 ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ హీరోలు తమ ట్విట్టర్ ఖాతాలో సైరా టీజర్ ని విడుదల చేసి తప్పకుండా చూడాలని ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే ప్రమోషన్స్ డోస్  ఇంకాస్త పెంచాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఎలా చేయాలనే దానిపై చిత్రబృందం ఓ ఆలోచన చేసిందట. అదేంటంటే బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తోనే ఒక రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్... తాజాగా సాహో సినిమా తో కూడా  బాలీవుడ్ లో  తనకున్న క్రేజ్ ని ఇంకాస్త పెంచుకున్నాడు. దీంతో ప్రభాస్ కి బాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. 

 

 

 ఈ క్రమంలోనే సైరా సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ ని రంగంలోకి దించాలని చిత్రబృందం ప్రయత్నిస్తుంది. అయితే ప్రభాస్ కి చిరంజీవి ఫ్యామిలీ కి మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సాహో సినిమా పై చిరంజీవి గారు   కాల్ చేసి అభినందించడం తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని  ప్రభాస్ కూడా మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ సైరా సినిమా కోసం బాలీవుడ్ ప్రమోషన్స్ కి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో  ప్రభాస్ సాహో సినిమా ప్రమోషన్స్ చేస్తే సినిమాకి  కాస్త  కలిసొచ్చే అవకాశం ఉంది.కాగా  అక్టోబర్ 2న విడుదల అయ్యే సైరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు బద్దలు కొడుతున్న చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: