మహేష్ బాబు ఏడాదికి ఒక సినిమా చేస్తాడని పేరు. ఆయన కష్టపడితే ఏడాదిన్నరకు రెండు మూవీస్ చేయగలడని కూడా అంచనాలు ఉన్నాయి. ఆ విధంగానే మహర్షి సినిమా తరువాత మహేష్ ఎనిమిది నెలల తేడాలో సరిలేరు నీకెవ్వరూ మూవీని ధియేటర్లకు తీసుకువస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. హుషారైన యంగ్ డైరెక్టర్. పక్కాగా ప్లానింగ్ ఉంటుంది. అంతే కాదు, స్పీడ్ కి మారు పేరు.


దాంతో చకచకా సినిమా షూటింగ్ అయిపోతోంది. ఇక మహేష్ బాబు షూటింగ్ పార్ట్ అంతా ఈ డిసెంబర్లో  పూర్తి అవుతుందని అంటున్నారు. సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరిలో వ‌స్తోంది. అది సరే కానీ మహేష్ నెక్స్ట్ మూవీ ఏంటి అన్న డౌట్ ఇపుడు ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ ఉంది. మహేష్ తో సినిమాలు చేఏందుకు చాలా మంది డైరెక్టర్లు  క్యూలో ఉన్నారు. కానీ వారంతా ఇపుడు స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నారట. 


అది పూర్తి చేసుకుని మూవీ కి రెడీ అవాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే మహేష్ డిసెంబర్లో  మేకప్ తీసేస్తే ముఖానికి రంగు పూసుకోవడానికి వచ్చే ఏడాది సమ్మర్ దాటిపోతుందన్నమాట. మహేష్ తో సినిమాలు చేసేందుకు వినిపిస్తున్న పేర్లలో రాజమౌళి పేరు కూడా ఉంది. అయితే ఆయన  కూడా ఇపుడు ఖాళీగా లేరు.


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా  ఉన్నారు. ఆ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ తరువాత రిలీజ్ చేసి కొంత గ్యాప్ తీసుకుంటారు. ఆ తరువాత మహేష్ సినిమా కధ మీద కూర్చుంటారన్న మాట. అంటే 2021 తరువాత కానీ ఈ కాంబో బయటకు రాదు. ఈ మధ్యలో మహేష్ మరో సినిమా చేసే అవకాశం ఉంది. కానీ దానికి కూడా చాలా సమయం పట్టేలా ఉంది మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: