బిగ్ బాస్ సీజన్ 3లో లాస్ట్ వీక్ రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ గురించి అందరు షాక్ అయ్యారు. రాహుల్, హిమజ, మహేష్ లు నామినేషన్స్ లో ఉండగా శనివారం రాహుల్ ని ఎలిమినేట్ చేసి చివరగా అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఆ ఎలిమినేషన్ నిజమేనేనో అని ఇంటి సభ్యులంతా తెగ ఫీల్ అయ్యారు.


అయితే సోమవారం ఎపిసోడ్ లో రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. పునర్నవి అయితే రాహుల్ ఎంట్రీతో ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. అయితే రాహుల్ ఎంట్రీ కాగానే శ్రీముఖి కళ్లలో ఏదో తెలియని ఓ భయం మొదలైంది. స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన అలి రెజా ఎలిమినేట్ అయ్యాడు తిరిగి రాలేదు.


కాని ఎలిమినేట్ అయ్యాడనుకున్న రాహుల్ తిరిగ్ రావడంపై శ్రీముఖి అందరి కన్నా షాక్ అయ్యింది. ముందునుండి రాహుల్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన శ్రీముఖి రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ విషయం తెలుసుకుని రాహుల్ కు బయట ఫాలోయింగ్ పెరిగి ఉంటుందని అంచనా వేసి ఉండొచ్చు. ఇక మీద హౌజ్ లో రాహుల్ తో తన ప్రవర్తనని మార్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక శ్రీముఖి కూడా కేవలం అరవడమే అని కాకుండా బిగ్ బాస్ టాస్కుల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తుంది.


రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు ఇక తన టార్గెట్ వరుణ్ సందేష్, బాబా భాస్కర్ అనుకున్న శ్రీముఖి గేం ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యిందని చెప్పొచ్చు. రాహుల్ రీ ఎంట్రీతో విన్నర్ గా వరుణ్ సందేష్ కన్ ఫాం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఫీమేల్స్ లో శివ జ్యోతి కూడా స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంది. మరి ఈవారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారో చూడాలి. ఇంకా ఆరు వారాలే ఉంది కాబట్టి ప్రతివారం నామినేషన్స్ ఈ సీజన్ కెప్టెన్ ను డిసైడ్ చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: