Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 11:14 pm IST

Menu &Sections

Search

సైరా కమర్షియల్ సినిమా అనడానికి సాక్షాలివిగో...?

సైరా కమర్షియల్ సినిమా అనడానికి సాక్షాలివిగో...?
సైరా కమర్షియల్ సినిమా అనడానికి సాక్షాలివిగో...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారీ బడ్జెట్ సినిమాలకు టాలీవుడ్‌ ఇండస్ట్రీ కేరాఫ్‌ అడ్రస్ గా మారుతోంది. ఇటీవలే అలాంటి భారీ సినిమా 'సాహో'ను యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తితో చూసింది. ఆ సినిమా తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదలయిన సంగతి తెలిసిందే. అంతేకాదు సాహో సినిమాకు కలెక్షన్లు కూడా తెలుగు కన్నా హిందీలోనే ఎక్కువగా రావడం విశేషం! అలా 'సాహో' వంటి భారీ సినిమా తర్వాత ఇప్పుడు 'సైరా' అంటూ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది మెగాస్టార్ 151 వ సినిమా.  
భారీతనంలో కొత్త అధ్యాయం సృష్ఠిస్తోంది 'సైరా నరసింహారెడ్డి'. బడ్జెట్‌లో భారీ తనమేకాదు.. కథలోనూ భారీతనం ఉన్న విషయం ఈ పాటికే అర్థమైంది. భారత స్వతంత్ర తొలి యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తోందని అందరికి తెలిసిన విషయమే.

సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే.. హింసాత్మక మార్గంలో బ్రిటీషు వారిపై తిరుగుబాటు జరిపిన వీరుడు ఉయ్యాలవాడ అన్న విషయం ఈ జనరేషన్ వాళ్ళకు తెలియకపోవచ్చుగాని నాటి తరానికి ఎంతో స్పష్ఠంగా తెలుసు. ఈ రేనాటి సూర్యుడి జీవిత కథను సినిమాగా తీయాలని చిరంజీవి చాలాకాలం కిందటే అనుకున్నారట. అయితే అది ఆయన రీఎంట్రీతో సాధ్యం అయింది. 'బాహుబలి' తర్వాత పెరిగిన తెలుగు సినిమా ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమా రూపొంది, అతి త్వరలోనే విడుదల కాబోతుంది.  చారిత్రక నేపథ్యమున్న చిత్రమే అయినా, వాస్తవ సంఘటనలు, పాత్రలకి కల్పన జోడించిన ప్రయత్నమే అయినా కానీ 'సైరా నరసింహారెడ్డి' పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కించారు. అలాగే కీలకపాత్రలు అన్నిటికీ తగిన ప్రాధాన్యత వుంటుందంటూ, వివిధ భాషలకి చెందిన నటీనటులని ఒకచోటికి చేర్చి ఇండియా అంతా ఏకమై యుద్ధం చేసిందనే భావన తీసుకురావడం మంచి కమర్షియల్‌ టచ్‌. బాహుబలి మాదిరిగా అద్భుతమైన నిర్మాణ విలువలు, యుద్ధ సన్నివేశాలకి తోడు హత్తుకునే ఎమోషన్స్‌ వుండడంతో సైరా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం అవుతుందని ధీమాగా ఉన్నారు ట్రేడ్ వర్గాలు.   

మెగాస్టార్‌ కెరీర్‌లోనే తొలిసారి రెండు వందల డెబ్బై కోట్ల ఖర్చుతో తీసిన సినిమా. బిజినెస్‌ రేంజ్‌ ఎంత అన్నది ఇప్పుడే ఎవరు ఒక అంచనాకి రాలేకపోవడం ఆసక్తికరం. 
తెలుగునాట సైరా సినిమా 60 నుంచి 65 కోట్ల రేషియోలో, నెల్లూరు లాంటి చిన్న ఏరియాలు 60 కోట్ల రేషియోలో, వైజాగ్‌ లాంటి పెద్ద ఏరియాలు 65 కోట్ల రేషియోలో విక్రయించారు. మొత్తంమీద కేవలం ఆంధ్ర ఏరియా నుంచి 65 కోట్లు రాబట్టారు. అలాగే సీడెడ్‌ నుంచి మరో 20కోట్లు, నైజాం నుంచి 30కోట్లు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 115 వరకు వచ్చాయని తాజా సమాచారం. మొత్తానికి థియేటర్‌ రైట్స్‌ ద్వారా 173కోట్లు ఇప్పటికే వచ్చాయని తెలుస్తోంది. బాలీవుడ్‌, అదర్‌ లాంగ్వేజెస్‌ అమౌంట్లు రావాలి. ఇదిలావుంటే నాన్‌ థియేటర్‌ హక్కులు కూడా తక్కువేమీ కాదు. కేవలం డిజిటల్‌ రైట్స్‌ మాత్రమే అన్ని లాంగ్వేజెస్‌ కలిపి వరల్డ్‌ వైడ్‌గా 50 కోట్లకు అమెజాన్‌ ప్రైమ్ విక్రయించారు. ఇక శాటిలైట్‌ హక్కుల నుంచి 100 కోట్లు వరకు వస్తాయని సైరా నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇది కనుక వర్కవుట్‌ అయితే, థియేటర్‌, నాన్‌ థియేటర్‌ రూపంలో మూడువందల కోట్ల వరకు వస్తాయి. మొత్తంమీద బిజినెస్‌ పరంగా సైరా మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలి.  


no dout about megastar syera movie its a commercial cinema
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'డిస్కో రాజా' 2020 కి షిఫ్టయ్యాడా..?
లండన్ లో మొదలైన బాహుబలి హంగామా..!
అమ్మాయిలు రాత్రి పూట సినిమాలకు, ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? తమ్మారెడ్డి..!
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'రంగమార్తాండ' తో వస్తున్న క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ..!
స్టార్ హీరోయిన్ అన్న పేరే రాలేదు అప్పుడే నిర్మాతలను ఏడిపిస్తుందట..?
చిన్నపిల్లలా ఏడ్చేసిన విజయశాంతి..కారణాలు తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..!
'మహాసముద్రం' లో పడింది వీళ్ళేనట..?
పూరి సినిమాలో శివగామి..!
కారవాన్ లో ఉండేవాడు అసలు హీరో నే కాదు అంటు సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు..!
బాలీవుడ్ లో అట్లీ-షారుఖ్ కాంబో రెడీనా..?
భర్త డైరెక్షన్ లో భార్య నటిస్తోందట..ఇది రేర్ కాంబినేషన్..?
ఆసక్తికరంగా మారిన అనసూయ-విజయ్ దేవరకొండల కాంబినేషన్..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కి చుక్కలు చూపించిన బాలీవుడ్ స్టార్ హీరో..ఈ విషయంలో మనవాళ్ళే కాస్త బెటర్..!
'స్వర భాస్కర్' స్వరాన్ని నొక్కేసింది బీజేపీ గవర్నమెంట్ అట..?
ఆస్కార్ బరిలో 'సెక్స్ రాకెట్' హీరోయిన్ సినిమా..!
ఖచ్చితంగా హిట్టే.. 'ప్రతిరోజూ పండగే'...అనిపించేలా ఉంది టీజర్..!
సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్..డిస్కోరాజా..!
గుర్రపు పందాలు కాయబోతున్న వెంకటేష్..!
సుకుమార్ బన్ని కి హ్యాండిస్తాడా..?
దర్శక, నిర్మాతలను భయపెడుతున్న టాలీవుడ్ హీరోయిన్..?
'ఇద్దరిలోకం ఒకటే'..అనిపిస్తోంది..!
'బిగ్ బాస్' షో కి హోస్ట్ చేయడమే డ్రీం అంటున్న యంగ్ హీరోయిన్..!
నాని సినిమాతో షాహిద్ మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
'ఆర్ ఆర్ ఆర్' మరో బాహుబలి కానుందా అందుకే రిలీజ్ లేట్ అవుతుందా..?
సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలేస్తున్న బాలయ్య..?
అర్జున్ రెడ్డి కాంబో క్రేజీ అప్‌డేట్..విజయ్ ఫ్యాన్స్ కి పండగే..?
'ఫ్యామిలీమ్యాన్-2' లో సమంత..!
జక్కన్న గారు ఇందులో వాస్తవమెంత..?
కొణిదెల కాంపౌండ్ క్లారిటి ఇస్తేనే నమ్మాలి..!
బిగ్ బాస్ వివాదం తో స్టార్ హీరో ఇల్లు ముట్టడి...ఇలాంటి షోలు అవసరమా..?
చాణక్య సినిమా రిజల్ట్ తో గోపిచంద్ పరిస్థితి మారిపోయిందా..?
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ 2021 కి వెళ్ళడానికి కారణాలు అవేనట..?
బన్ని ని డామినేట్ చేస్తున్న త్రివిక్రమ్..?
24 గంటల తేడా కూడా లేకపోతే ఎలా..?
రాజ్ తరుణ్ ని 'ఒరేయ్‌.. బుజ్జిగా' అంటున్నదెవరు..?
బన్ని హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.