తెలుగు లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. టెంపర్ మూవీ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నా ఎన్టీఆర్ ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటించాడు.  ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ గా నటిస్తున్నాడు.  ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై కూడా భారీ అంచనాలే పెరిగిపోయాయి. 

అయితే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఎవరి దర్శకత్వంలో నటిస్తున్నాడు అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో అప్పడే మొదలయ్యాయి.  తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి తో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీ.. విజయ్ హీరోగా 'బిగిల్' అనే సినిమా తీస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'తేరి', 'మెర్సల్' సినిమాలు సూపర్ హిట్ కావడంతో 'బిగిల్' సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎలానూ ఎన్టీఆర్ కి తమిళంలో సినిమా చేయాలనే ఆశ ఉండడంతో బైలింగ్యువల్ సినిమా ఉంటుందని భావించారు.

చాలా కాలంగా అట్లీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ మూవీ తెలుగు స్టార్ హీరోతో చేస్తే తన క్రెడిబులిటీ కూడా బాగుంటుందని భావిస్తున్నాడు.  అయితే అట్లీ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత అట్లీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా  ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయంపై అటు అట్లీ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ స్పందిస్తారేమో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: