ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిపేసి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ మూడు భాషల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు మల్టీ టాలెంట్ గా గుర్తింపు దక్కించుకుని తండ్రి కమల్ హాసన్ కు తగ్గ కూతురు అని నిరూపించుకుంది శృతి హాసన్. అయితే గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడే సింగర్ గా పలు షోలు చేసింది. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తెలుగులో మళ్ళీ ఇన్నాళ్ళకి మాస్ మహారాజ రవితేజ తో ఒక సినిమా కమిటయినట్లు తెలిసిందే.  

శృతి హాసన్ హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టకముందు నుండే ఆమె మీద రకరకాల పుకార్లు ఉండేవి. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో లవ్ అఫైర్స్ అంటూ వార్తలు వచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క దాని గురించి అంతగా రియాక్ట్ కాలేదు శృతి. అయినా కూడా లండన్ వ్యక్తితో ప్రేమలో పడ్డట్లుగా ప్రచారం జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఇదే విషయాన్ని శృతి కూడా ఒప్పుకుంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అసలు కారణాలు తెలీదు గాని ఇద్దరు విడిపోయారు. 

రిసెంట్‌గా ఈ విషయాల గురించి శృతి హాసన్ మాట్లాడుతూ ప్రేమలో ఉన్నప్పుడు బయటకు చెప్పాలంటే అప్పట్లో బయపడేదాన్ని... ప్రేమిస్తున్నాను అనగానే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం నాలో ఉండేది. మొదటి సారి ప్రేమలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు.. అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయాం. రెండవ సారి ప్రేమలో పడ్డప్పుడు మాత్రం నేను నా ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకోలేదు. మీడియాలో కూడా వార్తలు వచ్చినా నేను పట్టించుకోలేదు. కాని జీవితాంతం అతడితో ఉండాలనుకున్న నాకు అలా కుదరదని అర్థమైంది. అందుకే బ్రేకప్ అయినందుకు బాధ పడలేదని చెప్పింది. ఇదంతా తెలిసిన వాళ్ళు.. మరి శృతికి మూడవ బాయ్ ఫ్రెండ్ అయినా భర్త అవుతాడా..? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: