జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టు విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తూ అద్భుతమైన ప్రాజెక్టులకు డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కోలీవుడ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తో సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.


ఇప్పటికే అట్లీ తమిళంలో విజయ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసి సెన్సేషనల్ రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా 'బిగిల్'  అనే సినిమా అట్లీ తెరకెక్కిస్తున్నాడు. గతంలో అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన 'తేరి', 'మెర్సల్' సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో 'బిగిల్' సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాబోయే దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ పక్కన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. కాగా విజయ్ సినిమా తర్వాత అట్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.


ముఖ్యంగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తన మార్కెట్ పెంచుకోవడానికి తమిళ్ లో కూడా ప్రాజెక్టు చేయాలనే ఉద్దేశంతో ఉన్న తరుణంలో...అట్లీ సినిమా తో స్ట్రైట్ గా తమిళ్ లో చేసి తమిళ్ ప్రేక్షకులను కూడా మెప్పించడానికి అట్లీ తో త్వరలోనే ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి...కానీ ఇప్పుడు కోలీవుడ్ లో అట్లీ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ తమిళ్ మార్కెట్ పై గట్టిగానే కన్ను వేశారని అంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెందినవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: