తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కధ చెప్పడం అంటేనే ఓ గర్వం. మన సీమ బిడ్డ. మన ప్రాంతానికి చెందిన వాడు. తెల్ల దొరలపై వీరోచింతంగా పోరాడిన వీరుడు. అటువంటి శూరుడి పాత్ర వేయాలని ఏ కళాకారునికైనా ఉంటుంది. అంతెందుకు తరువాత కాలంలో బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి సీతారామరాజు కధను సినిమా తీయాలని నాటి టాప్ స్టార్స్ ఎన్టీయార్, క్రిష్ణ పోటీ పడిన చరిత్ర కళ్ల ముందే ఉంది. అటువంటిది ఉయ్యాలవాడ స్టోరీని సినిమాగా చేయాలని మన హీరోలు ఎందుకు అనుకోలేదు.


నిజానికి ఈ కధను సినిమాగా చేయాలని పరుచూరి బ్రదర్స్ దశాబ్దాల కాలం పాటు అందరి హీరోల వెంట తిరిగారు. తొంబై దశకం చివర్లో బాలక్రిష్ణ సీమ రెడ్ల పాత్రలను అద్వితీయంగా పోషిస్తూ ఓ విధంగా పౌరుషానికి పెట్టింది పేరుగా బ్రాండ్ అంబాసిడార్ గా మారాడు. ఆ టైంలోనే ఆయన‌కు సూపర్ హిట్ సినిమాగా సమర సింహారెడ్డి వచ్చింది. ఆ తరువాత బాలయ్యతో ఉయ్యాలవాడ కధతో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. పరుచూరి బ్రదర్స్ ఆ విధంగా అప్రోచ్ అయ్యారు కూడా.


మరి ఎక్కడ తేడా కొట్టిందో బాలయ్య చేయాలనుకున్న ఉయ్యాలవాడ కధ కాస్తా మెగాస్టార్ వద్దకు వెళ్లింది. అయితే ఆ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్న చిరంజీవి ఈ సినిమాకు నో చెప్పేశారని అంటారు. తిరిగి ఇన్నాళ్లకు అదే చిరంజీవి ఉయ్యాలవాడ కధతో 151 సినిమా చేయడం అంటే నిజంగా గ్రేట్ అనాల్సిందే. ఈ సినిమాను ఆయన తనయుడు రాం చరణ్ నిర్మించడం కూడా మరో గొప్ప విషయం. 


ఈ విషయాలను సైరా ప్రి రిలీజ్ ఫంక్షన్లో పరుచూరి వెంకటేశ్వరరావు చెబుతూ ఈ కధను ఎంతో మంది హీర్లకు చెప్పినా కూడా చివరికి చిరంజీవికే చేరిందని, ఆయన పూర్తిగా ఈ పాత్రకు యాప్ట్ అంటూ కితాబు ఇచ్చారు. మొత్తానికి ఈ కధ సినిమా గా రావడానికి ఇన్ని మలుపులు ఉన్నాయి. సినిమా అనుకున్నాక ఎన్నో మలుపులు జరిగాయి. రిలీజ్ అయితే మరెన్ని మలుపులతో చరిత్ర స్రుష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: