తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సోమవారం జరిగిన ఎపిసోడ్ తో 65 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. మొత్తంమీద చూసుకుంటే 10వ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో వాతావరణం మొత్తం రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ వీక్షకులను ఎంతగానో సోమవారం జరిగిన ఎపిసోడ్ అలరించింది. ముందుగా బాబా భాస్కర్ శ్రీముఖి ల మధ్య సరదా సంభాషణ తో స్టార్ట్ అయిన ఎపిసోడ్...పునర్నవి.. రాహుల్ ని కలవరిస్తూ అతడి కోసం పాట పాడుతుండగా...హౌస్ లోకి రాహుల్ ఎంట్రీ ఇస్తూ ఎంతగానో చూసే వీక్షకులకు మరియు ఇంటిలోని సభ్యులకు షాక్ ఇవ్వడం జరిగింది.


ముందుగా హౌస్ లో రాకముందు రాహుల్ తన వాయిస్ తో ప్రేమ సందేశం పంపగా ఇంటిలో ఉన్న పునర్నవి ఆనందంతో గంతులు వేసింది. రాహుల్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే పరుగున వెళ్లి ఎప్పటిలాగే తన కౌగిలిలో బంధీ చేసుకుంది పునర్నవి. దీనిలో భాగంగా హౌస్ మేట్స్ ని జంటలుగా విడగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. జంటలుగా విడగొట్టిన వారిని హాట్ సీట్ లో కూర్చోపెట్టి ఇద్దరూ తమ బలాల గురించి మాట్లాడుతూ హౌస్ లో ఉండడానికి అర్హులా కాదా..? అనే విషయం గురించి మాట్లాడాలి.అయితే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేవ్‌ అవుతారనే కండీషన్‌ పెట్టారు.


ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల మధ్య భీకర మాటల పోరు జరిగింది. శివజ్యోతి ఎమోషనల్ పర్సన్ అని అదే వీక్‌నెస్‌ అంటూ శ్రీముఖి నామినేట్‌ చేయగా.. ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను చంపి గేమ్‌ ఆడేదానివంటూ శివజ్యోతి.. శ్రీముఖిపై విరుచుకుపడింది. వీరిద్దరిలో హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు శివజ్యోతికి పడడంతో ఈ వారం ఆమె సేవ్ అవ్వగా.. శ్రీముఖి నామినేట్ అయింది. కాగా ఇదే ఈ క్రమంలో  రవి, వితికాలలో వితికా సేవ్ అవ్వగా.. పునర్నవి, బాబా భాస్కర్ లలో పునర్నవి సేవ్ అయింది.రాహుల్, వరుణ్ లలో రాహుల్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శ్రీముఖి, వరుణ్, రవి, బాబా భాస్కర్ లు. వీరిలో ఈ వారం బయటకి వెళ్లేదెవరో చూడాలి. మొత్తం మీద సోమవారం జరిగిన ఎపిసోడ్ చాలా హైలెట్ గా నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: