గోవా బ్యూటీ ఇలియానా మొత్తానికి సన్నబడింది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఇలియానా చాలా కాలం తర్వాత సంతోషంగా కనబడింది . ఇన్స్టాగ్రామ్ లో ఇలియానా బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియో ను 16 లక్షల మంది చూసారు. 5 లక్షల లైక్స్ వచ్చాయి..ఆమె అందానికి ముగ్ధులైన అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతూ ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ చేసారు. ఇలియానా ఇండస్ట్రికి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అయినా. ఆమె అందం రవ్వంత కూడా తగ్గలేదు.అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది.
 రీసెంట్ గా ఇలియానాకు బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ తో బ్రేకప్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లో ఫిలాసఫీ పోస్ట్ లు చేసింది. ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజుల ముందు పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యపరిచింది. అవును. మన జీవితంలో స్నేహితులను.. కుటుంబ సభ్యులను.. జీవిత భాగస్వాములను కోల్పోయే సందర్భాలు వస్తాయి. అయితే మన జీవితం నుండి ఎవరు వెళ్ళిపోయినా మనల్ని మనం మాత్రం కోల్పోకూడదు. లైఫ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనల్ని మనచుట్టూ ఉండేవారు ప్రేమించడం లేదని మనకు తెలిసినప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి.. మనకు మనమే తోడుగా నిలవాలి అంటూ ఫిలాసఫీ చెప్పింది. 
 ఈ పోస్ట్ ను బట్టి ఇలియానా అతని ఆలోచన నుండి బయటికి రావడానికి చాలా కష్టపడుతుందని అనుకున్నారు.అయితే ఇప్పుడు చేసిన పోస్ట్ ను చూస్తే ఆమె బ్రేకప్ బాధ నుండి బయటకు వచ్చినట్లు ఉంది. ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పాగల్ పంటి' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ లో విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: