సాధారణంగా సెన్సార్ బోర్డు సభ్యులు ఒక సినిమాను చూసిన తరువాత ఆ సినిమా వారికి నచ్చితే ఆ సినిమాను ప్రశంసిస్తూ ఆ మూవీ దర్శకుడుకి తమ ఫీలింగ్స్ తెలియచేస్తారు కాని ఏకంగా ఆ మూవీ హీరోకు డైరెక్ట్ గా ఫోన్ చేసి ప్రశంసలు కురిపించరు. ఇప్పుడు ఈ విషయంలో కూడ ‘సైరా’ ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

నిన్న ‘సైరా’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీని ఆకాశంలోకి ఎత్తేస్తూ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 164 నిముషాల నిడివితో ఉన్న ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను చూసిన బోర్డు సభ్యులు తమకు ఈసినిమా ఒక హాలీవుడ్ సినిమాలో కనిపించే యాక్షన్ సీన్స్ తో ఒక అద్భుత సినిమాను చూసినట్లు ఫీలింగ్ కలిగిందని కామెంట్స్ చేసినట్లు టాక్. 

అయితే ఈ సినిమాలో ఉయ్యాలవాడ పాత్ర కొందరు బ్రిటీష్ సైనికులను సజీవ దహనం చేసిన సీన్స్ ఉండటంతో U/A సర్టిఫికేట్ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేకుంటే ఈ మూవీకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇవ్వవలసిన సినిమా అనీ ఈ మూవీలో కట్ చేయడానికి ఒక్క సీన్ కూడ తమకు కనిపించలేదనీ సెన్సార్ వర్గాలు దర్శకుడు సురేంద్ర రెడ్డి దగ్గర అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ మూవీ చూసిన ఉత్సాహంతో కొందరు సెన్సార్ సభ్యులు ఏకంగా చిరంజీవికి ఫోన్ చేసి అభినందించడమే కాకుండా ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించి నటించిన చిరంజీవి ఖ్యాతి చరిత్రలో నిలిచిపోతుంది అని కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే వార్ సీన్స్ చూసే ప్రేక్షకులు అంతా 18వ శతాబ్దపు రోజులలోకి వెళ్ళి పోతారు అంటూ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: