టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ఫైటర్..అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. హీరోగా మంచి ఫామ్ లోకి వస్తున్న సమయంలోనే కొన్ని పరిస్థితుల వల్ల సినిమాలకు దూరమయ్యాడు.  తెలుగులో యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగినవారి జాబితాలో సుమన్ కూడా కనిపిస్తారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.  సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.  కొంత కాలంగా తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్నారు.  అయితే శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలో విలన్ గా నటించారు. 

అప్పటి వరకు తెలుగు లో టాప్ హీరోగా నటించిన సుమన్ ని విలన్ గా చూడటం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయాడు.  తెలుగు టాప్ హీరోయిన్ల సరసన నటించి విలన్ గా తన్నులు తినడం ఏంటని విమ్శలు కూడా వచ్చాయి.  కానీ క్యారెక్టర్ బాగుంది కదా కొత్తగా ట్రై చేశా అంటూ సమర్ధించుకున్నారు సుమన్.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను తెలుగు లో ఎంతో మంచి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాను. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత హీరో తరహా పాత్రల్లో కాకుండా నా వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నాను.

అయితే తమిళంలో 'శివాజీ' సినిమాలో నేను విలన్ గా చేశాను. శంకర్ - రజనీ కాంబినేషన్లోని సినిమా కావడంతో విలన్ గా చేసేందుకు అంగీకరించాను. ఆ సినిమాలో నేను చేసిన పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో తమిళంలో నాకు విలన్ పాత్రలకు బాగా డిమాండ్ కూడా పెరిగిపోయింది. తమిళంలో అదే తరహా పాత్రలు వరుసగా వచ్చాయి. స్టార్ హీరోలైన విజయ్,అజిత్, ధనుశ్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు చేశాను. అలా అదే ఊపును కంటిన్యూ చేస్తూ తమిళంలో బిజీ అయ్యాను.



మరింత సమాచారం తెలుసుకోండి: