బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్ని ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది. వీక్ డేస్ లో ఆశించిన స్థాయిలో రేటింగ్స్ లేకపోయినా వీకెండ్ లో మాత్రం రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. తమిళంలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై నటి కస్తూరి అత్యంత చెత్త షో అని కామెంట్లు చేసింది. 
 
తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కస్తూరి కొన్ని రోజుల్లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు ఎక్కువగా చేసే కస్తూరి తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కస్తూరికి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కెవిన్ గ్రూపుతో ఎప్పుడూ గొడవలు జరిగేవి. 
 
ఆ గ్రూపులోని సభ్యులు కాకి అంటూ కస్తూరిపై విమర్శలు చేసేవారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మధుమిత, దర్శకుడు చేరన్ మాత్రమే కస్తూరితో సన్నిహితంగా మెలిగారు. ఈ ఆదివారం దర్శకుడు చేరన్ ఈ షో నుండి ఎలిమినేట్ కావటం జరిగింది. లాస్లీయాకే తక్కువ ఓట్లు వచ్చినా బిగ్ బాస్ నిర్వాహకులు కావాలనే చేరన్ ను ఎలిమినేట్ చేశారనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. 
 
కెవిన్, లాస్లీయాల మధ్య లవ్ ట్రాక్ ఉండటంతో లాస్లీయాను ఎలిమినేట్ చేయలేదనే ఆరోపణలు కూడా వినిపించాయి. బిగ్ బాస్ షోలో ఇలా జరగటంతో బిగ్ బాస్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా కస్తూరి అత్యంత మోసమైన షో బిగ్ బాస్ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. బిగ్ బాస్ షో ప్రారంభం కాక ముందు తెలుగులో కూడా వివాదాలు మొదలైనా షో ప్రారంభం అయిన తరువాత వివాదాలు ఆగిపోయాయి. కానీ తమిళంలో మాత్రం కస్తూరి వ్యాఖ్యలతో వివాదం మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: