‘గద్దల కొండ గణేష్’ కలక్షన్స్ స్థిరంగా కొనసాగుతూ ఉండటంతో ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. చిరంజీవి ‘సైరా’ విడుదల కావడానికి మరొక వారం రోజులు సమయం పట్టే పరిస్థితులలో ఈ వారం కూడ కలక్షన్స్ పరంగా ఈ మూవీ హవా కొనసాగే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ పరిస్థితులలో ఈ మూవీ ప్రమోషన్ ను మరింత పెంచి ఈ మూవీ బయ్యర్లకు లాభాలు బాగా కలుగ చేసి తన ఇమేజ్ ని పెంచుకోవాలని హరీష్ శంకర్ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

‘అర్జున్ రెడ్డి’ సక్సస్ అయిన తరువాత తాను విజయ్ దేవరకొండను ఒక కథ చెపుదామని ప్రయత్నించిన విషయాలను వివరిస్తూ అప్పట్లో తాను విజయ్ కు ఒక మెసేజ్ పెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే విజయ్ తన మెసేజ్ కు స్పందిస్తూ రెండు సంవత్సరాల వరకు తనకు ఖాళీ లేదనీ ఆ తరువాత తన కథ వినడానికి ప్రయత్నిస్తాను అంటూ తనకు మెసేజ్ పెట్టిన విషయాన్ని వివరించాడు. 

విజయ్ క్రేజ్ ‘అర్జున్ రెడ్డి’ తరువాత బాగా ఎదిగిపోయిన  విషయం వాస్తవమే అయినా తన లాంటి దర్శకుడుకి అలా మెసేజ్ పెట్టకుండా కనీసం ఒక్కసారి ఫోన్ చేసి ఉంటే తాను ఆనంద పడి ఉండేవాడిని అంటూ కామెంట్ చేసాడు. తాను పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ని అన్న విషయం బహుశా విజయ్ దేవరకొండకు తెలిసే ఉండాలి అంటూ చురకలు అంటిస్తూ విజయ్ కి చాల మంచి భవిష్యత్ ఉందని అభిప్రాయ పడ్డాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: