లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, తొలి సినిమాతో పర్వాలేదనిపించింది. అయితే ఆ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఆమె చందమామ అనే సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. ఆపై రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో కాజల్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక అక్కడినుండి వరుసగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ, ఆ తరువాత పలువురు స్టార్ హీరోల సరసన నటిస్తూ వచ్చిన కాజల్, ప్రస్తుతం టాలీవుడ్ మేటి స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. 

ఇక ఇటీవల పలు వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తున్న కాజల్, ప్రస్తుతం లోకనాయకుడు కమల్ మరియు దర్శకుడు శంకర్ ల కాంబినేషన్లో రాబోతున్న భారతీయుడు 2 కోసం పలు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక పత్రికతో ప్రత్యేకంగా ముచ్చటించిన కాజల్, తనకు మొదటి నుండి ఏ పనిలో అయినా క్రమశిక్షణతో నడుచుకోవడం అలవాటని అంటోంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయని, అయితే వాటిని మనం ఆత్మవిశ్వాసం మరియు గుండె ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని అంటోంది. 

అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది, అయితే ఆ పనులను ఇష్టంతో కనుక చేసినట్లయితే మనం పొందే సుఖం వేరని కూడా చెప్తోంది. కెరీర్ పరంగా తనకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ తాను మాత్రం హిట్స్ వచ్చినపుడు ఎలా ఉన్నానో, అదే విధంగా ఫ్లాప్స్ వచ్చిన సమయంలో కూడా అలానే ఉన్నానని, మనం చేయదలచుకున్నవి ధైర్యంగా చేసుకుంటూ ముందుకు సాగితే గెలుపు తప్పనిసరిగా వస్తుందని అంటోంది. అయితే ఈ ముద్దుగుమ్మ చెప్తున్న జీవిత సత్యాల పై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మంచి ప్రశంశలు కురుస్తున్నాయి.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: