మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా  విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా జెఆర్‌సీలో ఈ చిత్ర యూనిట్ స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ... తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ప‌ని చేసిన‌, హాస్య‌ర‌సాన్ని ఎంతో గొప్ప‌గా పండించ‌గ‌ల వ్య‌క్తి బ్రహ్మానందంగారు. ఆయ‌న‌తో ఈ చిత్రంలో ఒక సీరియ‌స్ డైలాగ్‌ని చెప్పించాను. సినిమా అనేది ఎంత గొప్ప‌దో బ్ర‌హ్మానందంగారు కూడా అదే గొప్ప‌వారు అన్నారు. అంతేకాక హాస్య‌ర‌సాన్ని పండించ‌గ‌లిగేవారు ఏ ర‌సాన్నైనా పండించ‌గ‌ల‌రు. సినిమాకి ప్ర‌త్యేకించి ఒక భాష‌, కులం, మ‌తం అనేది ఉండ‌దు. ఎవ‌రు ఎక్క‌డైనా న‌టించ‌వ‌చ్చు. మీరు చాలా ప్యాష‌నేట్‌. మీరు ఉన్న ఇండ‌స్ట్రీలో మేము ఉండ‌డం చాలా అదృష్టం అందులోనూ మిమ్మ‌ల్ని డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డం మ‌హాభాగ్యం అని అన్నారు. ఈ చిత్రంలో డింపుల్ ఒక ప్ర‌త్యేక పాట‌కు డాన్స్ చేసినందుకు చాలా హ్యాపీ. శ్రీ‌దేవిగారి పాత్ర‌ను చెయ్యాలంటే పూజానే క‌రెక్ట్ అనిపించింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే నేను పూజాకు పెద్ద ఫ్యాన్‌ని. డిజె చిత్రం నుంచి గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రానికి యాక్టింగ్‌లో చాలా మార్పు వ‌చ్చింది. త‌ను ఆ క్యారెక్ట‌ర్ చెయ్య‌డానికి ఒప్పుకున్నందుకు త‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. అలాగే నేను ఏ హీరోతో న‌టించినా వాళ్ల‌కు ఒక పేరు పెడ‌తాను. అలాగే ర‌వితేజ‌కి మాస్ మ‌హారాజా అని నేనే పేరు పెట్టాను. అలాగే వ‌రుణ్‌కి కూడా మెగాప్రిన్స్ అని పేరు ఉంది. కాని వ‌రుణ్ కి పోస్ట‌ర్స్ మీద ఆ పేరు వెయ్య‌డం ఇష్టం లేదు. ఓన్లీ వ‌రుణ్ అని రావాల‌న్నారు. కానీ కేవ‌లం వ‌రుణ్ అంటే అందులోని ప‌వ‌ర్ క‌నిపించ‌డం లేద‌ని మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ అని పెట్టాను. ఆయ‌న‌ను ఒప్పించి ఆ పేరు పెట్టాను అని అన్నారు. ఇక‌పోతే డైరెక్ష‌న్ అనేది ఒక క్రాఫ్ట్ లాంటిది. కాని సంగీత‌మ‌నేది ఒక ఆర్ట్. డైరెక్ష‌న్ నేర్చుకుంటే ఎవ‌రైనా చెయ్య‌గ‌ల‌రు. కానీ సంగీతం చాలా క‌ష్టం. మిక్కీజే మేయ‌ర్ అందించిన సంగీతం చాలా గొప్ప‌గా ఉంది. ఈ సినిమా ఇంత క్వాలిటీతో చాలా అద్భుతంగా రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రామ్ అచంట‌, గోపి అచంట‌గారు. ఈ చిత్రం మీద చాలా కాంట్ర‌వ‌ర్సీలే వచ్చాయి. ఫైన‌ల్ గా అన్నీ కామెడీల‌య్యాయి. ఈ చిత్ర విజ‌యాన్ని ఫైన‌ల్‌గా వాల్మికీ మ‌హ‌ర్షికి అంకిత‌మిస్తున్నా అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: