తెలుగు లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 2006లో వైవీఎస్ చౌదరి రూపొందించిన 'దేవదాసు' సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.  హీరో రామ్, అందాల భామ ఇలియానా కు ఇది మొదటి సినిమా. అయితే వీరిద్దరికీ మొదటి సినిమా అయినా సీనియర్ నటుల్లా నటించి మంచి పేరు సంపాదించారు.  ఈ మూవీలో ఇలియానా సెక్సీ లుక్స్, నడుం అందాలు సగటు ప్రేక్షకులనే కాదు..దర్శక, నిర్మాతలను ఫిదా చేసింది.  దాంతో వరుసగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఛాన్సు దక్కించుకుంది.

తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది.  బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఇలియానాకు తెలుగు లో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి.  చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీలో ఇల్లీ బేబీ బొద్దుగా కనిపించడం తో అభిమానులు పెదవి విరిచారు.  ఎక్కడ ఆ నడుం వొంపుల సుందరీ అంటూ ప్రశ్నించారు.  దాంతో ఇలియానా తన ఫిజిక్ పై దృష్టి పెట్టింది..ఎంతో నాజూగ్గా తయారైంది.  మొత్తానికి మళ్లీ తన పాత ఫిజిక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. ఇందులో ఇలియానాని చూసిన అభిమానులు నోరెళ్ల‌పెడుతున్నారు. ఆ మద్య విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల‌ ఇల్లీ బేబీ గ‌ర్భ‌వ‌తి అంటూ ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.  ప్రస్తుతం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: