ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉంటుంది.  ప్రభాస్ కు అప్పులు ఉండటం ఏంటి.. నిర్మాతలు చిక్కుల్లో పడటం ఏంటి అసలు అర్ధం కావడం లేదు కదా.  అక్కడికే వస్తున్నా.  ప్రభాస్ సాహో సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు.  సాహో నిర్మాతలకు గట్స్ ఉన్నాయని, సింహం లాంటి గుండె అని భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొంతమంది నిర్మాతలు పేర్కొన్న సంగతి తెలిసిందే.  కానీ, సినిమా రిలీజ్ తరువాత పూర్తిగా మారిపోయింది.  


సాహో పరాయజం పాలైంది.  సాహో ఫెయిల్ కావడంతో బయ్యర్లకు నష్టాలు మిగిలాయి.  అటు నిర్మాతలు కూడా ఇబ్బందుల్లో పడ్డారు.  నిర్మాణాలు ప్రభాస్ కు స్నేహితులు కావడంతో సినిమా తీసేందుకు ముందుకు వచ్చారు.  బాహుబలి తరువాత సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే తమ స్నేహితుడిని చూపించాలి అనుకున్నారు.  కానీ,సినిమా రిలీజ్ తరువాత ఫెయిల్ కావడంతో నష్టాలు మిగిలాయి.  


సినిమా కోసం నిర్మాతలకు ప్రభాస్ హామీ మీద ఫైనాన్షియర్లు డబ్బులు ఇచ్చారు.  సినిమా ఫెయిల్ కావడంతో ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి మొదలైంది.  ప్రభాస్ పై ఒత్తిడి రావడంతో మీడియాకు ప్రభాస్ దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  ఒకవేళ నిజంగా ప్రభాస్ చిక్కుల్లో పడితే ఆ విషయం బయటకు రాకుండా ఉంటుంది.  ప్రభాస్ కు హెల్ప్ చేయడానికి ఎంతమంది నిర్మాతలు లేరు.  


ప్రభాస్ తో సినిమా చేయాలని సిద్ధంగా ఉన్న నిర్మాతలు ఆయనకు డబ్బులు ఇచ్చి ఆదుకోలేరా చెప్పండి.  పైగా బయటకు చెప్పినట్టుగా సినిమాకు ఆ స్థాయిలో బడ్జెట్ కాలేదని, హైప్ కోసమే బడ్జెట్ ఎక్కువ అయ్యింది అని చెప్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం ఈ పుకార్ల నుంచి ప్రభాస్ బయటపడాలి అంటే ముందు దీనిపై ప్రభాస్ రెస్పాండ్ కావాలి.  నెక్స్ట్ సినిమాను కూడా యూవీ సంస్థ నిర్మిస్తోంది.  సో, ఆ మూవీ సెట్స్ మీద ఉన్నది.  ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరిగింది.  ఆ సినిమా షూటింగ్ ముందుకు వెళ్ళింది అంటే వచ్చిన వార్తలన్నీ పుకార్లే అనుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: