సినిమాల్లో హీరోలుగా చేసిన వాళ్ళు డైరెక్టర్లు గా మారుతుంటారు. అలాగే దర్శకత్వం చేసిన వాళ్ళు నటన వైపు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసి హీరోగా పేరు సంపాదించిన వారు చాలా తక్కువనే చెప్పాలి. సినిమాకి సంగీతం అందించిన సంగీత దర్శకులు హీరోలుగా చేసినా కూడా ఒకటి, రెండు సినిమాలు తప్పితే హీరోగా తమకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ.


సంగీత దర్శకుడి నుండి హీరోగా మారి, సక్సెస్ ఫుల్ గా తన జర్నీని కొనసాగిస్తున్న హీరో "జి.వి ప్రకాష్ కుమార్". ఈయన తమిళంలో పలు చిత్రాలకు సంగీతం అందించారు. తమిళంలో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాజా రాణి సినిమాకి సంగీతం అందించింది ఈయనే. తెలుగులో ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రానికి సంగీతం అందిచడం జరిగింది సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా తన కెరియర్ ని కొనసాగిస్తూనే, మొదటి సారి రజనీ కాంత్ నటించిన "కుచేలన్" సినిమా ద్వారా మోహానికి రంగు వేసుకున్నాడు.


ఇక అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కాగా ప్రకాష్ ఇప్పుడు ఓ హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ‘డెవిల్‌నైట్‌’ నిర్మాత డెల్‌ గణేశన్‌ తదుపరి నిర్మిస్తున్న ‘ట్రాప్‌ సిటీ’ చిత్రంలో జీవీ ప్రకాశ్‌ హీరోగా నటిస్తున్నారు. రికీ పర్చల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంగ్ల నటుడు జాన్సన్‌ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రవర్గాలు చెప్పడం జరిగింది.


ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మన్ మేనల్లుడైన ప్రకాష్ ప్రస్తుతం దాదాపు పది చిత్రాలలో నటిస్తూ బిజీ గా ఉన్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన  100% లవ్ చిత్ర తమిళ రీమేక్ లో జి.వి ప్రకాష్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకి జోడీగా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే నటించింది. ఎమ్ ఎమ్ చంద్రమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగు దర్శకుడు సుకుమార్ నిర్మించారు. అక్టోబర్ 4 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: