నాచురల్ స్టార్ నాని , మనం ఫేమ్ విక్రమ్ కుమార్  కాంబినేషన్ లో  తెరకెక్కిన చిత్రం  గ్యాంగ్ లీడర్.  ఇటీవల విడుదలైన ఈచిత్రం  నెగిటివ్ టాక్ ను  తెచ్చుకున్నప్పటికీ     మొదటి మూడు రోజులు  బాక్సాఫీస్ వద్ద  13కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అదుర్స్ అనిపించగా  ఆ తరువాత వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి చేతులేత్తిసింది. 11రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  15కోట్ల షేర్ ను మాత్రమే  రాబట్టి భారీ ప్లాప్ దిశగా పయనిస్తుంది.  సినిమాకు  నెగిటివ్ టాక్ వచ్చిన..  నాని తన నటనతో  ప్రేక్షకులను థియేటర్లకు  రప్పిస్తాడని అనుకున్నారు కానీ అలా జరుగలేదు  దానికి తోడు  వరుణ్ తేజ్ , గద్దలకొండ గణేష్  వల్ల కూడా ఈ సినిమాకు భారీ నష్టం  జరిగింది.  ఆ సినిమాకు హిట్ టాక్ రావడంతో  గ్యాంగ్ లీడర్ ను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపించలేదు. దాంతో  ఈచిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లు వెలవెల బోతున్నాయి. 



తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే  ఓవర్సీస్ లో ఈచిత్రం పర్వాలేదనిపించింది. కానీ అక్కడ  కూడా  హిట్ అనిపించుకోలేకపోయింది. ఇప్పటివరకు అక్కడ ఈ చిత్రం 920k డాలర్లను  రాబట్టింది. ఫుల్ రన్ లో 1మిలియన్ మార్క్ నుచేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది.  ఇటీవల వరుస పరాజయాల తరువాత  జెర్సీ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన  నాని కి తాజాగా గ్యాంగ్ లీడర్ గట్టి  షాక్ ఇచ్చింది.  ఇక నాని ప్రస్తుతం  మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో  సుధీర్ బాబు  మరో హీరోగా నటిస్తుండగాప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: