వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "గద్దలకొండ గణేష్". తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండకి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతుంది. ఈ సినిమాలో వరుణ్ నటనని మంచి మార్కులు పడ్డాయి. మొదటిసారిగా వరుణ్ మాస్ లుక్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు.


నిజానికి ఈ సినిమాలో వరుణ్ చేసిన పాత్ర పూర్తి నెగెటివిటీతో కూడుకున్నది. తమిళంలో జిగర్తాండ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహా పాత్రలో వరుణ్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఇలాంటి క్యారెక్టర్ ని ఒప్పుకోవడమే వరుణ్ గొప్పతనం అని చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్ తో ఆయనలోని నటుడు సంపూర్ణంగా బయటకు వచ్చాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దర్శకుడు ఈ సినిమాని చాలా చక్కగా తీర్చి దిద్దారు.


ఈ సినిమాలో చాలా మార్పు చేశారు. ఒరిజినల్ మూవీలో ఉన్న ఇంటెన్సిటీని ఎక్కడా పోగొట్టకుండా చాలా పకడ్బందీగా మార్పులు చేయడం చాలా బావుంది. ఇకపోతే మొదటగా ఈ సినిమా పేరును "వాల్మీకి’ అని నిర్ణయించారు. కానీ కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నాయని నిరసన చేయడంతో, చివరి నిమిషంలో ఆ పేరును మార్చి గద్దలకొండ గణేష్ గా మార్చారు. సినిమా రిలీజ్ కి ఆరు గంటల ముందు సినిమా పేరు మార్చాల్సి రావడం ఇదే మొదటిసారేమో!


సినిమా పేరు మారినా, దాని ప్రభావం ఈ సినిమా సక్సెస్ ని ఆపలేకపోయాయి. ‘గద్దలకొండ గణేష్‌’ సక్సెస్‌ అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హరీష్‌ శంకర్‌ ఈ సినిమా ద్వారా వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని చాటాలని ప్లాన్‌ చేశాం కానీ కొందరు అందుకు అడ్డు పడ్డారు. దాంతో చేసేది లేక టైటిల్‌ను మార్చేశాం. హైందవ మతంలో పుట్టిన వ్యక్తిగా, రామాయణం, వాల్మీకి మహర్షిపై ఉన్న గౌరవంతో ఈ చిత్రాన్ని వాల్మీకి మహర్షికి అంకితం చేస్తున్నాం అని హరీష్‌శంకర్‌ ప్రకటించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: