వరుస  సక్సెస్ లతో  ప్రస్తుతం బాలీవుడ్ లో  మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో గా కొనసాగుతున్న  ఆయుష్మాన్ ఖురానా తాజాగా  డ్రీం గర్ల్ తో  మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.  భారీ అంచనాల మధ్య  ఇటీవల  విడుదలైన ఈ చిత్రం  సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టి  బాక్సాఫీస్ వద్ద  సత్తా చాటుతూ 100కోట్ల క్లబ్ లో చేరింది. 11 రోజుల్లో ఈ చిత్రం 101కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం.  రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రంలో నుశరత్ బరుచా హీరోయిన్ గా నటించింది.  ఆయుష్మాన్  తన కెరీర్ లో ఈ చిత్రంద్వారా  మొదటి సారి  లేడీ  గెటప్ లో  కనిపించాడు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేసిన  ఈచిత్రాన్ని  జీ స్టూడియోస్  తో కలిసి శోభ కపూర్ ఏక్తా కపూర్ లు నిర్మించారు.  ఫుల్ రన్ లో ఈచిత్రం 125కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 



ఇక ఈ చిత్రంతోపాటు  హిందీ లో ప్రస్తుతం చిచ్చోరె కూడా హావ సాగిస్తుంది.  డ్రీం గర్ల్ కంటే ముందుగానే విడుదలైన ఈ చిత్రం  100కోట్ల క్లబ్ లో చేరి ఆ చిత్రానికి  గట్టి పోటీనిస్తుంది.  నితీష్ తివారి  తెరకెక్కించిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , శ్రద్ధ కపూర్ , నవీన్ పోలిశెట్టి , వరుణ్ శర్మ ,తహీన్ రాజ్ భాసిన్ కీలక పాత్రల్లో నటించారు.  ఇక ఈ ఏడాది  బాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకు 12సినిమాలు 100కోట్లకు పైగా వసూళ్లను సాదించాయి. ఇందులో  సాహు , 2.0 వంటి  డబ్బింగ్ సినిమాలు కూడా వున్నాయి. ఈఏడాది వార్ , హౌస్ ఫుల్ 4 , దబాంగ్ 3  సినిమాలు కూడా విడుదలకానుండడంతో  బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: