‘గద్దలకొండ గణేష్' కీలకమైన నిన్నటి సోమవారం పరీక్షలో మంచి మార్కులతో బయటపడటంతో ఇండస్ట్రీ వర్గాలు ఈ మూవీని హిట్ లిస్టులోకి చేర్చారు. దీనితో వరుణ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తనకు ఈ మూవీ టైటిల్ మార్పు వివాదం మొదలైనప్పుడు వచ్చిన టెన్షన్ ను రామ్ చరణ్ జూనియర్ లు ఎలా పోగొట్టారో వివరించాడు. 

కోర్టు కేసు రీత్యా ఈ మూవీ టైటిల్ ను కేవలం విడుదలకు ఒకరోజు ముందు మార్చడంతో తాను విపరీతంగా టెన్షన్ పడ్డ విషయాలను వివరించాడు. అంతేకాదు తనకు ఏ సమస్య వచ్చినా ఆసమస్యను తన అన్న రామ్ చరణ్ తో చెప్పుకోవడం తన అలవాటు అంటూ తనకు చరణ్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించాడు. 

ఇలాంటి పరిస్థితులలో తాను తన అన్న చరణ్ కు ఫోను చేసినప్పుడు అతడు నవ్వుతూ తన ఇంటికి రమ్మని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే తాను చరణ్ ఇంటికి వెళ్ళిన సమయానికి అప్పటికే చరణ్ జూనియర్ లు కలిసి కాఫీ తాగుతు ఏదో ఒక విషయాన్ని మాట్లాడుకుంటున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అక్కడికి వచ్చిన తనకు వారిద్దరూ ఒక కాఫీ ఇచ్చి తన టెన్షన్ ను తగ్గించిన విషయాన్ని బయటపెట్టాడు.

అంతేకాదు తన మూవీ హిట్ అవుతుందని ముందుగానే జోష్యం చెప్పి తనకు చరణ్ జూనియర్ లు ధైర్యం కల్గించారని చెపుతూ వారి సపోర్ట్ వలెనే తనకు అప్పటి టెన్షన్ పూర్తిగా తగ్గిన విషయాన్ని తెలియ చేసాడు. అంతేకాదు హరీష్ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ తనతో సినిమా చేస్తాడని అనుకోలేదు అని అంటూ ‘గద్దలకొండ గణేష్’ విజయాన్ని తన అన్న అంకితం ఇస్తున్నాడు వరు వరుణ్ తేజ్..




మరింత సమాచారం తెలుసుకోండి: