మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం " సైరా". రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఇ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథ అందించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదపు ౩౫౦ చిత్రాలకు కథలు అందించిన ఘనత వాళ్ల సొంతం. కథలే కాకుండా, సంభాషణల్లో వారిది అందె వేసిన చేయి. పవర్ ఫుల్ డైలాగ్స్ అయినా, కామెడీ అయినా అలవోకగా రాస్తారు.


పరుచూరి డైలాగ్స్ అంటే ఉండే క్రేజ్ వేరు. అలాంటిది ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వీరు కథ అందించిన సినిమా "సైరా". దాదాపు రెండు దశాబ్దాల కిందటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సిద్ధం చేసి దాన్ని సినిమాగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు పరుచూరి బ్రదర్స్. ఈ కథ చిరంజీవి చేస్తేనే బాగుంటుందని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా  ఆయన కోసం వేచి చూశారు.


చివరికి చిరంజీవికి పరుచూరి సోదరుల కథ నచ్చి ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమాని భారీ బడ్జెట్ లో తీయాలి కాబట్టి వేరే నిర్మాతలని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ స్వయంగా రంగంలోకి దిగాడు. పరుచూరి బ్రదర్స్ చిరంజీవినే డైరెక్ట్ చేయాల్సిందిగా భావించినప్పటికీ, చిరంజీవి దానికి ఒప్పుకోలేదట. పరుచూరి సంభాషణలకి ఎంతో పేరున్నప్పటికీ ‘సైరా’లో ఒక్క డైలాగ్ కూడా రాయలేదట.


చిరంజీవి 150 వ సినిమా అయిన ఖైదీ నంబర్ 150 సినిమాకి మాటలు రాసిన సాయి మాధవ్ బుర్రా చేత మొత్తం మాటలు రాయించారట. ఖైదీలో మాటలు బాగా నచ్చడంతో చిరంజీవి ఆ అవకాశాన్ని సాయికే ఇచ్చాడట. సైరా సినిమాలోని పూర్తి మాటలు నేనే రాశానని సాయి మాధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి ముందు చెప్పడం విశేషం. పరుచూరి బ్రదర్స్ కి ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదో దర్శక నిర్మాతలకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: