తమిళ స్టార్ హీరో విజయ్ నటించే ప్రతి సినిమా ఈ మద్య వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది.  ఇప్పటికే మెర్సల్, సర్కార్ ఎన్నో వివాదాల మద్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  మెర్సల్ మూవీ విషయంలో డాక్టర్ల మనోభావాలు దెబ్బతినే విధంగా...డాక్టర్లు గా పనిచేస్తున్నవారంతా ప్రైవేట్ వ్యహారాలు నడుపుతున్నారని ఈ మూవీలో చూపించారని..ప్రజలకు వైద్యం చేసే వారిపై ఇలాంటి ఆరోపలు చేస్తూ సినిమాలో చూపించడం ఎంత వరకు సమంజసం అని వారు తీవ్రంగా విమర్శించారు.

ఇదే సమయంలో జీఎస్టీపై కూడా ఈ మూవీలో వివాదం చెలరేగింది.  మొత్తానికి అన్ని అవాంతరాలు దాటి సినిమా మంచి హిట్ కావడం..భారీ కలెక్షన్లు రాబట్టడం జరిగింది. ఇటీవల ఎన్నికల సమయంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్’ రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంది.  జయలలిత పిరియడ్ లో ఎన్నో స్కీములు అమలు చేశారు..అయితే బహుబతులు ఇచ్చి ఓట్లు రాబట్టడం వల్ల సరైన ప్రభుత్వం ఉండదని ఈ మూవీల విమర్శించారు. దాంతో పలువురు రాజకీయ పార్టీ నేతలు ఈ మూవీపై భారీ ఎత్తున విమర్శలు చేయడమే కాదు మూవీ రిలీజ్ అడ్డుకున్నారు.  మొత్తానికి ఈ మూవీ తెలుగు, తమిళంలో మంచి హిట్ అయ్యింది. తాజాగా ప్రస్తుతం విజయ్, అట్లీ కాంబినేషన్ లో 'బిగిల్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై కూడా వివాదం మొదలైంది.

ఈ సినిమా విషయంలో విజయ్ పై  మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.తమిళనాడులోనే కాకుండా మొత్తం భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా విజయ్ ప్రవర్తించారని.. అతడికి తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. మత్య్స, మాంస వ్యాపారులు తమ పనిని మొదలుపెట్టే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారు. ఇటీవల ‘బిగిల్’ ఫస్ట్ లుక్ లో విజయ్ డబుల్ రోల్ కనిపిస్తున్నాడు..అయితే అతని కాలు వద్ద ఓ కత్తి ఉండటం ఇప్పుడు వివాదానికి తెరలేపింది.

ఈ పోస్టర్ మత్స్య,మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించే ఉందని.. ఆ సన్నివేశాలను సినిమా నుండి తీయకపోతే దేశ వ్యాప్తంగా మత్స్య, మాంసం వ్యాపారుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.  అంతే కాదు..తాజాగా దర్శకుడు అట్లీ, హీరో విజయ్ లకు నోటీసులు కూడా పంపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: