బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కేవలం ఓ నలుగురు కంటెస్టంట్స్ చేతుల్లోకి వెళ్లిపోయిందా..? ఏ వీక్ ఎవరిని నామినేట్ చేయాలి.. ఎవరిని సేవ్ చేయాలి.. ఎవరిని టార్గెట్ చేయాలనేది వారి చేతుల్లోనే ఉందా..? ఇంతకీ బిగ్ బాస్ హౌజ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


ప్రస్తుతం 9 మంది కంటెస్టంట్స్ ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో మహేష్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. అయితే మిగిలిన 8 మందిలో జంటలుగా చేసి ఈ వారం నామినేషన్ ప్రక్రియ చేశాడు బిగ్ బాస్. శ్రీముఖి, శివ జ్యోతి.. రవి, వితిక.. బాబా భాస్కర్, పునర్నవి.. వరుణ్ సందేష్, రాహుల్ ఇలా నాలుగు జంటలు నామినేషన్స్ లో పాల్గొని ఎదుటి వారి కన్నా తామెందుకు ఇంట్లో ఉండాలో చెప్పాల్సి ఉంటుంది.


అయితే సోమవారం జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ లో బ్యాచ్ గా ఉన్న వరుణ్ సందేష్, రాహుల్, వితిక, పునర్నవి ఇద్దరు శ్రీముఖికి, ఇద్దరు శివ జ్యోతికి ఓటేశారు. అయితే ఫైనల్ గా బాబా భాస్కర్ ఓటు వేయాల్సి ఉండగా శివ జ్యోతికి బాబా ఓటు వేశారు. సో శ్రీముఖి, బాబా భాస్కర్ ఎంత క్లోజ్ గా ఉన్నా శివ జ్యోతిని సేవ్ చేయడం జరిగింది.   


అంతేకాదు నిన్న జరిగిన నామినేషన్స్ మొత్తం ఆట మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిందన్న భావన కలిగింది. రాహుల్ వెళ్లినట్టు వెళ్లి మళ్లీ వచ్చే సరికి గ్యాప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. ఏది ఏమైనా బిగ్ బాస్ ఆధ్వర్యంలో చాలా తెలివిగా పైన చెప్పిన నలుగురు బిగ్ బాస్ గేం ను తమ గేం గా మార్చుకున్నారు. అందరు ఫెయిర్ గా అనిపిస్తున్నా ఆట మాత్రం వారి చేతుల్లోనే ఉందన్న ఫీలింగ్ వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: