`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకుని ఈ చిత్రం క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 5న  విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ...


చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ ``మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రంవిందు భోజ‌నంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చూశామ‌ని గ్యారంటీగా ఫీల్ అవుతారు. కె.రాధాకృష్ణ‌గారి అద్భుత‌మైన సంగీతం, జి.ఎల్‌.ఎన్‌.బాబు బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌, సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ - శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.
నవీన్ విజయకృష్ణ,  శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర, అశోక్ కుమార్, ప్రభావతి,  జబర్దస్త్ రామ్,  జబర్దస్త్ బాబి, గౌతంరాజు, అప్పాజీ, క్రాంతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బాలాజి సానల
నిర్మాతలు: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి,  సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్, డి.ఓ.పి.     : జి.ఎల్.ఎన్. బాబు, ఎడిటింగ్   : మధు, కొరియోగ్రఫీ  : భాను, మేకప్ : ప్రేమ్ రాజ్, స్టోరీ : శ్రీమంగళం, రమ్య,  ఆర్ట్ : కృష్ణమాయ, ఫైట్స్ : రామ్ సుంకర, పాట‌లు: వనమాలి, పెద్దాడ మూర్తి, శ్రీహరి మంగళంపల్లి, కాస్ట్యూమ్ డిజైనర్ : భార్గవీ రెడ్డి, కాస్ట్యూమర్ : నాగరాజు, ప్రొడక్షన్ మేనేజర్ : సుబ్బు ఎసపి.ఆర్.ఓ. : వంశీ - శేఖర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: