టాలీవుడ్ లో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు.. టాప్ స్టార్స్ గా ఎదిగి చిరంజీవి నట వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ తగిన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకూ పలు హిట్ లు సాధించిన వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్రలో జీవించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు.

 


రీసెంట్ బ్లాక్ బస్టర్ (వాల్మీకి) గద్దలకొండ గణేశ్ తో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో ప్రామినెంట్ హీరో అయిపోయాడు. ఇప్పటి వరకూ వరుణ్ సాధించిన హిట్స్ ను టీమ్ తో పంచుకున్నాడు. ఫిదా.. సాయి పల్లవి, తొలిప్రేమ.. వెంకీ అట్లూరి, రాశి ఖన్నా, ఎఫ్2.. వెంకటేశ్ తో కలిపి వరుణ్ కి క్రెడిట్ దక్కింది. కానీ తొలిసారి (వాల్మీకి) గద్దరకొండ గణేశ్ తో పూర్తిస్థాయి క్రెడిట్ ను సోలోగా దక్కించుకున్నాడు. వరుణ్ పెర్ఫార్మెన్స్ కు సెంటర్లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి వీకెండ్ కాకుండా సోమవారం కూడా కలెక్షన్లు, హౌస్ ఫుల్స్ స్టడీగా ఉన్నాయంటే వరుణ్ ఏస్థాయిలో రఫ్ ఆడేశాడో అర్ధం చేసుకోవచ్చు. టైటిల్ మార్పు సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. మరొక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ రూపంలో మరో స్టార్ వచ్చేసినట్టే.

 


చిరంజీవి ఫ్యామిలీకి పెట్టని కోటలా నిలిచే మాస్ మంత్రంతోనే వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ తో పాటు క్రేజ్ సంపాదించాడు. చిరంజీవిని మాస్ ప్రేక్షకులే తెలుగు సినిమా మహరాజును చేశారు. వరుణ్ కూడా తాను మాస్ పాత్ర చేస్తే ఏస్థాయిలో ఉంటుందో గద్దలకొండ గణేశ్ గా చేసి చూపించాడు. సైరా.. వచ్చేవరకూ వాల్మీకి మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: