బుల్లితెర యాంకర్ గానే కాదు అడపాదడపా సినిమాల్లో కూడా అలరించే శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా వచ్చింది. మొదటినుండి శ్రీముఖి టాప్ 3 లో ఉండటం పక్కా అని అనుకుంటున్నారు. అలానే తన గేమ్ ప్లాన్ తో నామినేషన్స్ లో ఉంటున్నా సేవ్ అవుతూ వస్తుంది. అంతకుముందు హోస్ట్ నాగార్జున కూడా శ్రీముఖి చేస్తున్న పనులకు తన సపోర్ట్ ఇచ్చేవారు.   


కాని రీసెంట్ గా ఓ రెండు మూడు వారాలుగా శ్రీముఖి ప్రవర్తన వల్ల నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడూ బాబా భాస్కర్ మీద తన అభిప్రాయాలను రుద్దుతూ ఉందని శ్రీముఖి మీద బ్యాడ్ టాక్ ఏర్పడింది. శ్రీముఖి ఓ అల్లరి పిల్ల.. మనసులో ఏమి ఉంచుకోకుండా మొహం మీదే చెప్పేస్తుందని ఇంతకుముందు ఉన్న ఈ ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తుంది.


హౌజ్ లో వరుణ్ సందేష్, వితిక, రాహుల్, పునర్నవి నలుగురు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు. వాళ్ల గ్రూప్ మీద శ్రీముఖి నెగటివ్ థాట్ తో ఉంది. ఇక సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా శివ జ్యోతి శ్రీముఖి మీద చేసిన కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. ఇంటి సభ్యుల్లో కాన్ఫిడెన్స్ ను కోల్పోయేలా చేస్తుందని శ్రీముఖి గురించి చెప్పింది శివ జ్యోతి.    


రోహిణి నామినేషన్స్ లో ఉన్న టైం లో ఆమె ఎలిమినేషన్ అవుతుందని చెప్పడం ఓ గేమ్ ప్లాన్ అని శివ జ్యోతి గట్టిగా చెప్పింది. అయితే ఇంతకుముందు యాంకర్ గా మంచి ఇమేజ్ ఉన్న శ్రీముఖికి హౌజ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఆ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తుంది. బిగ్ బాస్ విన్నర్ అవడం అటుంచితే బయటకు వచ్చాక శ్రీముఖి కెరియర్ మీద ఈ ఎఫెక్ట్ పడకుండా ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు.         



మరింత సమాచారం తెలుసుకోండి: