దేశంలోనే మొట్టమొదటి మెగాస్టార్… బాలీవుడ్ నటరత్నం... అమితాబ్ బచ్చన్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా యూనియన్ మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. తన నట జీవితంలో ఇప్పటికే ఎవరికీ సాధ్యం కానన్ని పురస్కారాలు అందుకున్న అమితాబ్ బచ్చన్ అలియాస్ బిగ్ బి మకుటంలో మరొక రత్నం చేరింది. 

ఈ సందర్భాన్ని ఉద్దేశించి యూనియన్ మినిస్టర్ తన ట్విట్టర్ ఖాతాలో - "దాదాపు రెండు తరాలకు స్పూర్తినిచ్చిన లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు ఏకగ్రీవంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు" అని వెల్లడించాడు. ఇన్ని రోజులు ప్రజలని తన నటనతో అలరించిన అమితాబ్ బచ్చన్ గారికి ఈ అవార్డు రావడంతో యావత్ భారతదేశంతో సహా అంతర్జాతీయ విభాగాలు కూడా చాలా ఆనందపడ్డాయి అని ఆయన అన్నారు. ఇందుకు ఆయనకు తన హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేశారు.

భారతదేశంలోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఏ ఒక్కరైనా అమితాబ్ బచ్చన్ తర్వాతే రజనీకాంత్, చిరంజీవి, కమలహాసన్ వంటి ఎంతోమంది హేమాహేమీలను స్ఫూర్తిగా తీసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు మీదపడుతున్నా ఎప్పటికి వెన్న తగ్గని ప్రతిభతో ఇప్పటికీ చిత్రాలు చేస్తున్న మన బిగ్ బి తర్వాత చిత్రం అలియా భట్ మరియు రణ్ బీర్ కపూర్ కలిసి నటిస్తున్న' బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. వచ్చే సంవత్సరం విడుదల కానున్న ఈ చిత్రం తో పాటు అమితాబ్ 'ఝుండ్', 'చహ్రే', 'గులాబో సితాబో' చిత్రాల్లో కూడా మెరిపించనున్నాడు. ఏదేమైనా అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప నటుడికి ఆ పురస్కారం తగ్గడం అనేది ఆ పురస్కారం యొక్క అదృష్టమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: