గత కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా ఉన్న ఈ బాగోతం బయటకి అసలు కనిపించదు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం రోజుకో కొత్త వ్యవహారం బయటకు వస్తుంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని దీని మీద ఇంకా ఫోకస్ ఎక్కువైంది. అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఇప్పుడిది ఒక రచ్చగా తయారైంది. ఓవైపు మీ-టూ ఉద్యమానికి మహిళలంతా మద్దతు తెలుపుతుంటే షకీలా మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అసలు కాస్టింగ్ కౌచ్ ఉదంతాల్ని మీ-టూ ఉద్యమం వరకు తీసుకురావడం ఎందుకని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు షకీలా. ఘటన జరిగినప్పుడే గట్టిగా రియాక్ట్ అయితే, మరొకరి ముందు సపోర్ట్ చేయండీ అంటు గోడు చెప్పుకునే అవసరం రాదు కదా అన్నది షకీలా పాయింట్.

"కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి చాలామంది బయటకు వచ్చి చెబుతున్నారు. అలా వచ్చి నలుగురితో చెప్పుకునేకంటే, అక్కడే చెప్పుతో కొట్టి మనకు మనంగా హ్యాండిల్ చేసుకోవచ్చనేది నా ఫీలింగ్. నాకు అలా జరిగిందని చెప్పుకోవడం, వాడు నన్ను అలా చేశాడని చెప్పుకోవడం, వీడు నన్ను ఇలా చేశాడని బయటకు చెప్పుకోవడం ఎందుకు? అంటు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు. నిజంగా ఆలోచిస్తే ఇది వాస్తవమే కదా అని చాలామంది అంటున్నారు. 

తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి ఇంతకముందే చాలా సందర్భాలలో స్పందించిన షకీలా.. అవకాశాల కోసం ఒకర్ని సంప్రదిస్తే, వాళ్లు చెప్పినట్టు చేయాలి. అందుకే తను అవకాశాల కోసం వెంపర్లాడలేదని అంటున్నారు. "సినిమా అవకాశాలు తగ్గినప్పుడు నేను ఎవ్వర్నీ కలవలేదు. అవకాశం ఇప్పించమని కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎప్పటికీ అలా చేయను...అంటు తన ఆలోచన విధానం గురించి చెప్పారు. అంతేకాదు ఇదే విషయాన్ని గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

ప్రస్తుతం తనకు ఛాన్సులు తగ్గిన విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు షకీలా. తనకు ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదని, అందుకే సినిమా నిర్మాణ రంగంలోకి వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఓ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్న షకీలా.. తనకు సినిమాలు తప్ప బయట లోకం తెలియదంటున్నారు. ఇక ఈ మధ్య తెలుగులోను చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: