త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలలో త్రివిక్రమ్..బన్నీ ని చూపించిన తీరు బన్ని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరికి బాగా నచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఫలితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న 'అల వైకుంఠపురంలో' తెరకెక్కుతోంది. ఎలాగైనా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు మన మాటల మాంత్రీకుడు-బన్ని. 

ఇక 2020 సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా మార్కెటింగ్ వ్యవహారాలు అప్పుడే మొదలయ్యాయి . ఆంధ్ర, సీడెడ్ నైజాం ఏరియాలకు ఇంకా రేటు ఫిక్స్ చేయలేదు కానీ... ముందుగా ఓవర్ సీస్ మాత్రం క్లోజ్ చేశారు. ఓవర్ సీస్ మార్కెట్ ఇటీవల అంత ఆశాజనకంగా లేదన్న సంగతి అర్థమవుతూనే ఉంది. అందువల్ల హీరో ఎవరైనప్పటికి సరైన రేట్లు రావడంలేదు. ఇలాంటి నేపథ్యంలో 'అల వైకుంఠపురంలో' సినిమాను తొమ్మిది కోట్లు రేషియోలో ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 8.56 కోట్లకు ఔట్ రేట్ చేసి, నలభై వేలు రికవరబుల్ అడ్వాన్స్ కలిపి తొమ్మిది కోట్లకు ఇచ్చారని ఫిల్మ్ నగర్ సమాచారం. అంటే ఒక విధంగా 8.56 కోట్లకే విక్రయించినట్లు... అన్నీ రకాలుగా చూసుకుంటే ఇది మంచి రేటేనని తెలుస్తోంది.

ఇప్పుడున్న మార్కెట్ ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల ట్రాక్ రికార్డు, అలాగే అల్లు అర్జున్ ఓవర్ సీస్ లెక్కలు, అన్నింటికి మించి సంక్రాంతికి మహేష్, రజనీ, బన్నీ, కళ్యాణ్ రామ్.. సినిమాలు పోటీపడడం వంటివి అన్నీ చూసుకంటే సినిమాకు మంచి రేటు వచ్చినట్లే. ఓవర్ సీస్ లో త్రివిక్రమ్ కు వున్న మార్కెట్ వల్ల ఈ రేటు వచ్చిందని అనుకోవాలి. ఇక 'అల వైకుంఠపురములో' సినిమా ఓవర్ సీస్ రైట్స్ రెగ్యులర్ బయ్యర్ బ్లూ స్కయ్ సంస్థ దక్కించుకుంది. ఇక 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో ఫ్లాప్ పడిన అల్లు అర్జున్ కి 'అల వైకుంఠపురంలో' సినిమా హిట్ తప్పనిసరి.


మరింత సమాచారం తెలుసుకోండి: