సౌత్ హీరోయిన్స్ తో పోల్చితే బాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సౌత్ లో ఒక హీరోయిన్ రెండు కోట్లు తీసుకుందంటే చాలా గొప్ప విషయం. కాని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ పలువురు సినిమాకు 10-15 కోట్లు తీసుకుంటున్నారు. అయినా కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కొందరు హీరోల స్థాయిలో తమ పారితోషికం ఉండటం లేదని సోషల్ మీడియా ద్వారా వాపోతున్నారు. అంతేకాదు ఈ మధ్య బాలీవుడ్ లో హీరోయిన్స్ రెమ్యునిరేషన్ విషయంలో కామెంట్స్ చేయడం చాలా కామన్ అయ్యింది.

ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమం లో హీరోయిన్ కృతి సనన్ పాల్గొంది. గతంలో మహేష్ బాబుతో '1 నేనొక్కడినే' సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ హిట్స్ అందుకోవడంతో తో చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు  ఈమె ఈ సదస్సులలో మాట్లాడుతూ బాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా టాపిక్ తెచ్చింది. బాలీవుడ్ లో రెమ్యూనరేషన్ విషయంలో హీరోయిన్స్ కు హీరోలతో పోల్చితే నాలుగు రెట్ల అన్యాయం జరుగుతుందని, హీరోయిన్స్ పై బాలీవుడ్ దర్శక, నిర్మాతలు పక్షపాతం చూపిస్తున్నారని, హీరోయిన్స్ విషయంలో చిన్న చూపు చూడటంతో పాటు పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం చూపిస్తున్నారని తన మనసులో ఉన్న బాధను బయటకు చెప్పుకొచ్చింది. 

అంతేకాదు హీరోయిన్స్ కూడా వంద కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు వందల కోట్లు సాధించాయి. అయినా కూడా ఇంకా హీరోయిన్స్ అంటే తక్కువగా చూస్తున్నారు, తక్కువగా అంచనా వేస్తున్నారని మాట్లాడింది. ఇలా ఇంకా ఎంత కాలం ఉంటుందో అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్స్ పారితోషికం హీరోలతో సమానం అయినప్పుడే వివక్ష అనేది తగ్గినట్లు అంటూ కృతి సనన్ అంటోంది. అయితే తన ఆవేదనలో అర్థమున్నప్పటికి అమితాబ్ కాలం నుండి హీరో సమానంగా హీరోయిన్ రెమ్యునిరేషన్ ఉన్న దాఖలాలు లేవన్న సంగతి తెలీదు కాబోలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: