బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో 10వ వారం ఎవరు ఊహించని విధంగా ఇంట్లో ఇప్పటివరకు చాలా క్లోజ్ గా ఉంటూ వస్తున్న వరుణ్ సందేష్, రాహుల్ సిప్లిగంజ్ ల మధ్య గొడవ జరిగింది. మంగళవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రవి కృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ ముగ్గురు శివ జ్యోతి కొడుకులుగా శ్రీముఖి, వితిక, పునర్నవి వారి భార్యలుగా నటించాల్సి ఉంటుంది.


ఆమెని మెప్పించి ఒప్పించి శివ జ్యోతి దగ్గర ఉన్న బ్రిక్స్ తో గోడ కట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఎవరైతే గోడని ఎక్కువగా కడతారో వారికి కెప్టెన్సీ టాస్క్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మంగళవారం ఎపిసోడ్ లో కోడళ్లు మాత్రమే పర్ఫాం చేసి అత్త గారైన శివ జ్యోతి మెప్పు పొందాలని చూశారు. కాని కొడుకులైన రవి, రాహుల్, వరుణ్ పెద్దగా టాస్క్ లో ఇన్వాల్వ్ అవలేదు.     


అయితే రేపటి ఎపిసోడ్ ప్రోమోలో మాత్రం ఇటుకలు దొంగతనం చేసే టాస్క్ లో వరుణ్ వర్సెస్ రాహుల్ గొడవపడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వరుణ్ సందేష్ మీద పడిపోయి బ్రిక్ తీసుకోడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలైంది. వరుణ్ చాలా సీరియస్ అయినట్టుగా ప్రోమోలో చూపించారు.   


ఇన్నాళ్లు హౌజ్ లో కలిసి ఉన్న వరుణ్, రాహుల్ ల మధ్య ఇలాంటి గొడవ ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ టైం లో కూడా వరుణ్ చాలా ఫీల్ అయ్యాడు. ఫైనల్ గా బిగ్ బాస్ ఆ ఇద్దరి స్నేహితుల మధ్య కూడా గొడవ పెట్టేశాడు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా గెలవడం కోసం అందరు ప్రయత్నిస్తారు. మరి ఈ టాస్క్ లో గొడవపడ్డ వరుణ్, రాహుల్ లు మళ్లీ ఎప్పటిలాగానే ఉంటారా లేదా అన్నది బుధవారం ఎపిసోడ్ లో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: