టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుంటే, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నారు, అలానే ఇటీవల ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ నటిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే కొద్దిరోజుల క్రితం బల్గెరియాలో తాజా షెడ్యూల్ ని సక్సెస్ఫుల్ గా జరుపుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్, లోలోపల ఒక విషయమై కొంత ఆందోళన పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 

అదేంటంటే, నిజానికి ఈ సినిమా ప్రారంభ సమయంలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన రాజమౌళి, అలా చేయకుండా ఉండాల్సిందని భావిస్తున్నారట. అయితే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో ఒకసారి రామ్ చరణ్ కు మరొక సారి ఎన్టీఆర్ కు కొద్దిపాటి గాయాలు అవడం, అలానే మధ్యలో హీరోయిన్ అలియా భట్ కు ఆరోగ్య సమస్యల కారణంగా షూటింగ్ పలుమార్లు వాడిదా పడ్డట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి కావలసి ఉండగా, 

మొన్నటి షెడ్యూల్ తో ఇంకా కేవలం నలభై శాతమే షూటింగ్ జరిగిందని అంటున్నారు. వారు చెప్తున్న ప్రకారం, సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవడానికి వచ్చే ఏడాది మే వరకు పడుతుందని, ఇక దాని తరువాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం కనీసం మూడు నుండి నాలుగు నెలల సమయం అవసరం అవుతుందట, దీనిని బట్టి ఆర్ఆర్ఆర్ చాలావరకు అనుకున్న విధంగా జులై 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం తక్కువని అంటున్నారు. అయితే ఈ వార్త నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: